Ind vs Eng 2nd Test: ఇండియా, ఇంగ్లండ్ రెండవ టెస్ట్ ప్రారంభం, మొహమ్మద్ సిరాజ్ రీ ఎంట్రీ
Ind vs Eng 2nd Test: చెన్నై చెపాక్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండవ టెస్ట్ ప్రారంభమైంది. పరువు కాపాడుకుని ప్రతీకారం తీర్చుకునేందుకు ఇండియా...పట్టు నిలుపుకునేందుకు ఇంగ్లండ్ పోటీ పడుతున్నాయి.
Ind vs Eng 2nd Test: చెన్నై చెపాక్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండవ టెస్ట్ ప్రారంభమైంది. పరువు కాపాడుకుని ప్రతీకారం తీర్చుకునేందుకు ఇండియా...పట్టు నిలుపుకునేందుకు ఇంగ్లండ్ పోటీ పడుతున్నాయి.
ఇండియా ఇంగ్లండ్ ( India England )ల మద్య రెండవ టెస్ట్( Second Test )మ్యాచ్ చెన్నై ( Chennai )లోని చపాక్ స్డేడియంలో ప్రారంభమైంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే తొలి టెస్ట్ విజయంతో 1-0 ఆధిక్యంలో నిలిచింది. పట్టు నిలుపుకునేందుకు ఇంగ్లండ్, ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ( World test championship )ఫైనల్లో భారత్ గెలవాలంటే కనీసం రెండు మ్యాచ్‌లలో తప్పక గెలవాలి.
చాలా రోజుల తరువాత ప్రేక్షకులకు ఈ మ్యాచ్ చూసేందుకు అనుమతి లభించింది. స్డేడియంలో 50 శాతం ప్రేక్షకులకు అనుమతి ఇచ్చారు. కరోనా బ్రేక్ తరువాత ప్రేక్షకులకు అనుమతిచ్చిన తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఇక మ్యాచ్ పరంగా చూస్తే టీమ్ ఇండియా (Team india )లో 3 మార్పులు, ఇంగ్లండ్ లో నాలుగు మార్పులు చోటుచేసుకున్నాయి. టీమ్ ఇండియా టాప్ 11లో మొహమ్మద్ సిరాజ్(Mohammad Siraj)రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. సిరాజ్ ఎంట్రీతో భారత బౌలింగ్ పటిష్టం కానుంది.
భారత్ తుది జట్టు
విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, రహానే, పంత్, అశ్విన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్
Also read: Ind vs Eng 2nd Test: Team Indiaపై తొలి టెస్టు నెగ్గినా 4 మార్పులతో బరిలోకి England క్రికెట్ జట్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook