Sarfaraz Khan Get Chance in India vs England 2nd Test Squad: ఇంగ్లాండ్ చేతిలో అనూహ్యంగా మొదటి టెస్టులో ఓటమి పాలైన టీమిండియాకు.. రెండో టెస్ట్ ముందు భారీ షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా రెండో టెస్టు నుంచి తప్పుకున్నారు. ఫిబ్రవరి 2న విశాఖపట్నం వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్‌లను జట్టులోకి సెలెక్టర్లు ఎంపిక చేశారు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కి ఎట్టకేలకు సెలెక్టర్ల నుంచి పిలుపు రావడంతో క్రికెట్ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రవీంద్ర జడేజా తొడకండరాల గాయంతో బాధపడుతుండగా.. కేఎల్ రాహుల్‌ కూడా కుడి కాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వీరిద్దరిని ప్రస్తుతం వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని బీసీసీఐ వెల్లడించింది. తొలి టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆటలో జడేజా వేగంగా పరిగెత్తగా.. తొడకండరాలు పట్టేశాయి. దీంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు. కేఎల్ రాహుల్‌ కూడా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కండరాల నొప్పితో ఇబ్బందిపడ్డాడు. రెండో టెస్టుకు వీరిద్దరి స్థానంలో ముగ్గురు ఆటగాళ్లకు అవకాశం కల్పించినట్లు బీసీసీఐ వెల్లడించింది. 


సర్ఫరాజ్ ఇప్పటివరకు 45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 66 ఇన్నింగ్స్‌లలో 3912 పరుగులు చేశాడు. సగటు 69.85 గా ఉండగా.. 14 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు బాదాడు. సర్ఫరాజ్‌కు ట్రిపుల్ సెంచరీ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన ఇండియా ఎ రెండో అనధికారిక టెస్టులో సర్ఫరాజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుగా ఎంపికయ్యాడు. 160 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 161 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సర్ఫరాజ్ భారీ ఇన్నింగ్స్‌తో భారత్ 16 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత సర్ఫరాజ్‌ ఖాన్‌కు జట్టులో చోటు దక్కింది.


రెండో టెస్టుకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్.


Also Read: Sharmila Meets Sunitha: షర్మిల మరో సంచలనం.. వివేకా కూతురు సునీతతో భేటీ


Also Read: RS Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎన్నిక


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి