IND vs IRE Playing XI: రుతురాజ్ ఔట్.. రాహుల్ ఇన్! భారత్, ఐర్లాండ్ డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే
India vs Ireland 2nd T20I Playing XI, Dream11 prediction. రెండు టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత్.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.
India vs Ireland 2nd T20I Playing XI, Dream11 prediction: రెండు టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత్.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. మంగళవారం భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. డబ్లిన్‌లోని ది విలేజ్ మైదానంలో రాత్రి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ఫలితాన్ని పునరావృతం చేసి సంపూర్ణ విజయంతో స్వదేశానికి వెళ్లాలని హార్దిక్ సేన చూస్తుండగా.. ఈ మ్యాచులో అయినా గెలిచి సిరీస్ సమం చేయాలని ఐర్లాండ్ చూస్తోంది. మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఓసారి పరిశీలిద్దాం.
ఇప్పటికే ఓ వన్డే గెలిచిన నేపథ్యంలో టీమిండియా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగలేదన్న సంగతి తెలిసిందే. రుతురాజ్ స్థానంలో దీపక్ హుడా బరిలోకి దిగాడు. రెండో మ్యాచ్‌లో కూడా వెంకటేష్ అయ్యర్‌కు నిరాశ తప్పకపోవచ్చు. ఐపీఎల్ 2022లో వన్‌డౌన్‌లో అదరగొట్టిన సంజూ శాంసన్ కూడా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.
దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. బౌలింగ్ విభాగంలో ఆవేశ్ ఖాన్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ 14 ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, యజువేంద్ర చహల్ బౌలింగ్ విభాగంలో ఆడనున్నారు. మొత్తానికి భారత్ ఈ మ్యాచులో రెండు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి.
భారత్ తుది జట్టు (అంచనా):
ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి/సంజూ శాంసన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్.
డ్రీమ్ ఎలెవన్ టీమ్:
దినేష్ కార్తీక్, సంజు శాంసన్, పాల్ స్టిర్లింగ్, ఇషాన్ కిషన్ (వైస్ కెప్టెన్), దీపక్ హుడా, హ్యారీ టెక్టర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), జార్జ్ డాక్రెల్, క్రెయిగ్ యంగ్, యుజ్వేంద్ర చహల్, ఉమ్రాన్ మాలిక్.
Also Read: Rohit Sharma Daughter: నాన్న రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఇంకా నెల రోజులు: సమైరా
Also Read: Samantha New Item Song: సమంత మరో క్రేజీ ఐటం సాంగ్.. ఇక రచ్చ రచ్చే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.