India vs New Zealand:  టీ20 వరల్డ్ కప్ పరాభవం అనంతరం...భారత్ కివీస్(India vs New Zealand 2021)తో పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా... బుధవారం జరిగే మొదటి టీ20లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. కెప్టెన్ రోహిత్(Rohit Sharma), కోచ్ రాహుల్ ద్రవిడ్ హయాంలో తొలి సమరానికి టీమిండియా సిద్ధమైంది. మ్యాచ్ సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో జరగనుంది. ఈ మైదానం తొలిసారి టీ20 మ్యాచ్ కు అతిథ్యమిస్తోంది. ఇక్కడ చివరిసారి 2013లో అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022 ప్రపంచకప్(T20 World cup 2022) పై దృష్టి సారించాలనుకుంటున్న టీమ్ఇండియా ఆ దిశగా ఆటగాళ్లను సిద్ధం చేయాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు పెద్ద సమస్య. కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్(Rahul Dravid) ఎవరెవరికీ ఏయే స్థానాలు కేటాయిస్తారో వేచిచూడాల్సిందే. ఇప్పడు జట్టులో ఐదుగురు ఓపెనర్లు ఉన్నారు. వారిలో కొందరికి మిడిల్ఆర్డర్ స్థానాలు కేటాయించడం సవాలే. రోహిత్, రాహుల్ టీ20లో ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 


Also Read: Warner On Williamson: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా విలియమ్సన్.. హింట్ ఇచ్చిన వార్నర్


వెంకటేశ్అయ్యర్ కూడా ఓపెనర్ గానే ఐపీఎల్లో(IPL) సత్తా చాటాడు. ఇప్పుడు అతడు మిడిల్ఆర్డర్లో రానున్నాడు. సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో వస్తాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, పంత్లతో భారత లైనప్ కాగితంపై బలంగానే ఉంది. జడేజా గైర్హాజరీలో అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ తరహా పాత్రను పోషించనున్నాడు. యూఏఈలో రాణించిన అశ్విన్(Ashwin) తుది జట్టులో స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశముంది. దీపక్ చాహర్, చాహల్ కూడాబరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. 


న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. టిమ్ సౌథీ(Tim Southee) న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. విలియమ్సన్ లేకున్నా కివీస్ బలంగానే కనిపిస్తోంది. సౌథీ, బౌల్ట్, మిల్నెలతో కూడిన పదునైన పేస్ విభాగం ఆ జట్టు సొంతం.  సోధి, శాంట్నర్ల రూపంలో మంచి స్పిన్నర్లూ ఉన్నారు. ప్రమాదకర ఓపెనర్‌ మిచెల్‌ ఫామ్‌ ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook