IND vs NZ: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 నేడే... మధ్యాహ్నం 12 నుంచి మ్యాచ్ ప్రారంభం..
IND vs NZ: వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్‌కు రెడీ అయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
India vs New Zealand, 1st T20I: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఇవాళ న్యూజిలాండ్‌తో టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. ఈ సిరీస్ కు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో.. చాలా వరకు కుర్రాళ్లతో కూడిన జట్టే కివీస్ కు వెళ్లింది. హార్ధిక్ పాండ్య కెప్టెన్ గా, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ వంటి కీలక ఆటగాళ్లు లేకుండా భారత్ ఈ సిరీస్ ఆడుతుంది. కోచ్ గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
రోహిత్-రాహుల్ లేకపోవడంతో శుభ్‌మన్ గిల్-ఇషాన్ కిషన్ లు ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. మిడిలార్డర్ లో సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, పంత్‌లతోపాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును నడిపించనున్నాడు. శ్రేయస్ లేదా సంజు ఇద్దరిలో ఒకరికే జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రపంచకప్ లో ఆడిన భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ లు ఈ సిరీస్ లోనూ ఆడనున్నారు. వీరికి తోడుగా ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్‌లు ఉన్నారు. స్పిన్నర్లుగా చాహల్, కులదీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
మరోవైపు కివీస్ జట్టు విషయానికొస్తే... గప్తిల్ గాయం నుంచి కోలుకోకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే. అయితే కాన్వేతో కలిసి అలెన్ ఫిన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి వైదొలగిన కీలక పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఈ సిరీస్ కు దూరమయ్యే అవకాశం ఉంది. ఫిలిప్స్, మిచెల్, నీషమ్, శాంట్నర్ వంటి కీలక ఆటగాళ్లు ఆ జట్టుకు ఉన్నారు. సౌథీ, ఇష్ సోథీ, ఆడమ్ మిల్నె, ఫెర్గూసన్ వంటి నాణ్యమైన బౌలర్లుతో ఆ జట్టు బరిలో దిగే అవకాశం ఉంది.
Also Read: IND vs NZ: రాహుల్ ద్రవిడ్‌కి విరామం ఎందుకు.. ఐపీఎల్ సమయం సరిపోదా! మండిపడిన రవిశాస్త్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook