IND Vs NZ T20: న్యూజిలాండ్‌తో తలపడబోయే జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు ఛాన్స్..?
India Vs New Zealand 2nd T20 Playing 11: కివీస్‌తో రెండో టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. మొదటి మ్యాచ్ వర్షార్పణం కావడంతో.. రెండో మ్యాచ్‌కు అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.
India Vs New Zealand 2nd T20 Playing 11: భారత్, న్యూజిలాండ్ జట్లు రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాయి. తొలి టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా.. ఆదివారం ఓవల్ మైదానంలో రెండో మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్లో ఓటమిని మరచిపోయి.. మళ్లీ విజయాల బాట పట్టాలని భారత్ చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా సెమీస్ ఓటమి నుంచి తేరుకోవాలని చూస్తోంది. రెండో టీ20 మ్యాచ్‌కు భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం..
న్యూజిలాండ్ సిరీస్‌కు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లకు మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. వారి స్థానంలో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌లు ఓపెనింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు దూకుడు పెట్టింది పేరు కాగా.. ప్రస్తుతం ఇద్దరు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వన్‌డౌన్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు తుది జట్టులో ఆడే ఛాన్స్ ఉంది. ఏ పిచ్ అయినా పరుగులు సాధించగల సత్తా అయ్యర్‌కు ఉండడంతో టీమిండియా టాప్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2022లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో రానున్నాడు. ఆ తరువాతి స్థానాల్లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కు దిగనున్నారు.
టీ20 ప్రపంచకప్‌లో పెద్ద ఆకట్టుకోలేకపోయిన భువనేశ్వర్ కుమార్.. మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. భూవీతోపాటు హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌లు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. యుజ్వేంద్ర చాహల్‌కు స్పిన్ విభాగం బాధ్యతలు తీసుకోనున్నాడు. ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌కు టాప్-11లో చోటు దక్కవచ్చు.
రెండో టీ20 టీమిండియా తుది జట్టు (అంచనా):
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్.
Also Read: Satyendra Jain: జైలులో మంత్రికి మసాజ్.. నెట్టింట వీడియో లీక్
Also Read: Ram Gopal Varma: డేంజరస్ మూవీతో వస్తున్న ఆర్జీవీ.. ట్రైలర్ రిలీజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook