IND vs PAK: ఆ వ్యాఖ్యలు కావాలని చేయలేదు..నన్ను క్షమించండి: వకార్
IND vs PAK: పాకిస్థాన్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ట్వీట్ చేశాడు. అసలేం జరిగిందంటే..
IND vs PAK: ప్రపంచకప్(T20 World Cup2021)లో భారత్, పాకిస్థాన్ జట్ల మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. దాయాదులు తలపడుతున్నాయంటే..అందరి కళ్లు ఆ మ్యాచ్ పైనే ఉంటాయి. గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా(Teamindia)పై పాకిస్తాన్ పదివికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ లో పాక్ విజయంలో కీలకపాత్ర పోషించిన పాక్ వికెట్ కీపర్, బ్యాటర్ రిజ్వాన్ డ్రింక్స్ విరామం సమయంలో నమాజ్ చేశాడు. దీనిపై పాక్ మాజీ ఆటగాడు వకార్(waqar younis) ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ సందర్భంగా హిందువుల మధ్యలో రిజ్వాన్(Mohammad Rizwan) నమాజ్ చేయడం నన్నెంతో ఆకట్టుకుంది’’ అని వ్యాఖ్యానించాడు.
దీనిపై పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వకార్ ట్విటర్‌లో క్షమాపణలు తెలిపాడు. ‘‘ క్షణికావేశంలో చేసిన వ్యాఖ్యలు అవి. ఎవరినీ ఉద్దేశించి చేసినవి కావు. ఎవరి మనోభావాలను గాయపరచాలని అలా చెప్పలేదు. ఈ వ్యాఖ్యలు కావాలని చేసినవి కావు. ఎవరి సెంటిమెంట్స్‌ను హర్ట్ చేయాలని కాదు. ప్రజలనంతా ఏకం చేసేవి క్రీడలు.మతం, రంగు, జాతి వంటి వాటికి ఆటల్లో చోటు లేదు’’ అని ట్వీట్ చేశాడు.
Also Read: Pakistani Cricketers: భారతీయ మహిళల్ని వివాహమాడిన పాక్ క్రికెటర్లు వీరే
ఆదివారం జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (57), రిషభ్ పంత్ (39) రాణించారు. అయితే, లక్ష్య ఛేదనలో మహమ్మద్ రిజ్వాన్ (79*), బాబర్ అజామ్ (68*) అర్ధశతకాలు బాదేశారు. దీంతో వికెట్ నష్టపోకుండా 17.5 ఓవర్లలోనే పాక్ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ప్రపంచకప్ టోర్నీల్లో పాక్ పై భారత్ విజయాలకు బ్రేక్ వేసినట్లయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook