సౌతాఫ్రికాతో జరుగుతున్న 6 వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగుతున్న 5వ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌కి దిగింది. రోహిత్ శర్మ చేసిన సెంచరీ టీమిండియా స్కోర్ పెరగడానికి దోహదపడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 106 బంతుల్లో సెంచరీ (10x4, 4x6)  పూర్తి చేశాడు. రోహిత్ 115 పరుగుల ( 126 బంతుల్లో 11x4, 4x6) వ్యక్తిగత స్కోర్ వద్ద వుండగా సౌతాఫ్రికా యువ పేస్ సంచలనం లుంగి ఎంగిడి విసిరిన బంతిని హిట్ ఇవ్వబోయి వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్ చేతికి చిక్కాడు. పోర్ట్ ఎలిజబెత్‌లో రోహిత్‌కి ఇది మొదటి సెంచరీ కాగా తన వన్డె కెరీర్ లో 17వ సెంచరీ. 


టీమిండియా మిగితా ఆటగాళ్ల బ్యాటింగ్ వివరాలు ఇలా వున్నాయి. 
కెప్టేన్ విరాట్ కోహ్లీ 36 పరుగులు ( 54 బంతుల్లో) 
శిఖర్ ధావన్ 34 పరుగులు ( 23 బంతుల్లో)
అజింక్య రహానే 8 పరుగులు  ( 18 బంతుల్లో)
శ్రేయాస్ అయ్యర్ 30 పరుగులు  ( 37 బంతుల్లో)
మొదటి బంతికే డకౌట్ అయిన హార్ధిక్ పాండ్య 
ఎంఎంస్ ధోనీ 13 పరుగులు ( 17 బంతుల్లో )
భువనేశ్వర్ కుమార్ 19 పరుగులు నాటౌట్ ( 20 బంతుల్లో ) 
కుల్దీప్ యాదవ్ 2 పరుగులు నాటౌట్ ( 4 బంతుల్లో ) 


5వ వన్డేలో సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి రెచ్చిపోయి ఆడాడు. తాను విసిరిన 9 ఓవర్లలో ఒక ఓవర్ మెయిడెన్ చేయడమే కాకుండా 51 పరుగులు ఇచ్చి 4 వికెట్లు ( రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, ఎం.ఎస్. ధోని) తీశాడు.