India vs Sri Lanka 2nd T20I Playing 11: పొట్టి ఫార్మాట్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్.. మరో విజయంపై కన్నేసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో లక్నో వేదికగా జరిగిన మొదటి టీ20లో భారీ విజయం అందుకున్న టీమిండియా.. శనివారం ధర్మశాల వేదికగా జరగనున్న రెండో టీ20లోనూ జయకేతనం ఎగురవేసి సిరీస్ పట్టాలని చూస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌పై దృష్టి పెట్టిన భారత్ ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బలహీనంగా కనిపిస్తున్న శ్రీలంక.. రోహిత్ సేనపై విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో టీ20లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. ఫిట్‌నెస్ సమస్యలతో మొదటి టీ20కి దూరమైన యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌.. ఈరోజు మ్యాచ్ ఆడనున్నాడు. రుతురాజ్ జట్టులోకి వస్తే.. దీపక్ హుడాపై వేటు పడనుంది. ఒకవేళ రుతురాజ్ ఓపెనింగ్ చేస్తే. ఇషాన్ మిడిల్ ఆర్డర్‌లో బరిలోకి దిగనున్నాడు. ఇక్కడ హుడాను కాకుండా సంజూ శాంసన్‌ను తప్పించే అవకాశం కూడా ఉంది. అయితే శాంసన్‌కు సరైన అవకాశాలు ఇవ్వలేదనే అపవాదు బీసీసీఐపై ఉంది. దాంతో ఆ సాహసం చేయకపోవచ్చు. 


ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ వస్తే.. ఫస్ట్ డౌన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ రానున్నాడు. అప్పుడు శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఐదవ స్థానంలో సంజూ శాంసన్ వస్తాడు. ఆరో స్థానంలో వెంకటేశ్ అయ్యర్, ఏడో స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయనున్నారు. జడేజాకు బ్యాటింగ్ ప్రమోషన్ వస్తే.. స్థానాలు తారుమారు అవుతాయి. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ బరిలోకి దిగనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చహల్ ఆడనున్నాడు.


తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వెంకటేశ్ అయ్యర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, జనిత్ లియానాగే, చరిత్ అసలంక, దినేష్ చండిమాల్ (కీపర్), దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, లహిరు కుమార. 


Also Read: Gold Rate Today 26 February 2022: మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!!


Also Read: TTD Hundi Income: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook