సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
భారత్- శ్రీలంక మధ్య విశాఖపట్టణంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
భారత్- శ్రీలంక జట్ల మధ్య విశాఖపట్టణంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. తొలుత భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌ను ఎంచుకోగా.. శ్రీలంక బ్యాటింగ్ చేసింది. శ్రీలంక జట్టు టీమిండియా ఎదుట 216 పరుగుల టార్గెట్‌ను పెట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ క్రీజులోకి వచ్చారు.
అయితే రోహిత్ శర్మ (7) మొదట్లోనే వికెట్ కోల్పోయారు. ఆ తరువాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి ధావన్ సెంచరీ నమోదు చేసాడు. 2 సిక్సులు, 13 ఫోర్లు బాదాడు. శ్రేయాస్ అయ్యర్ అర్థ సెంచరీ పూర్తి చేసి 65 పరుగులు చేసాడు. మరో ఆటగాడు దినేష్ కార్తీక్ 26 (నాటౌట్) పరుగులు చేసాడు. దీంతో భారత్ 32.1 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.