IND vs WI 1st ODI Live Streaming: కరేబియన్ జట్టుపై టెస్టు సిరీస్ గెలిచి మాంచి ఊపుమీదున్న భారత్ ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్ కు రెడీ అయింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా.. తొలి మ్యాచ్ ఇవాళ కింగ్ స్టన్ ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం, రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. వరుణుడి కారణంగా టెస్టు సిరీస్ ను క్వీన్ స్వీప్ చేయలేకపోయినా భారత్.. వన్డేల్లోనైనా ఆతిథ్య జట్టును క్వీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. త్వరలో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఈ సమయంలో విండీస్ ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా రోహిత్ సేన అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. వెస్టిండీస్‌తో ఆడిన చివరి 8 వన్డేల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ తుది జట్టులో ఎవరుంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రోహిత్, శుభ్‌మన్‌ ఓపెనింగ్ చేస్తారు. ఫస్ట్ డౌన్ లో కోహ్లీ వస్తాడు. శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో సూర్య కుమార్ యాదవ్ ను జట్టులోకి తీసుకోనున్నారు. తర్వాత ఎవరినీ ఆడించాలనేది టీమిండియా మేనెజ్ మెంట్ ముందు ఉన్న పెద్ద ప్రశ్న. కీపర్ స్థానం కోసం ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ల మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఎవరికీ జట్టు దక్కుతుందో చూడాలి. ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్య టీమ్ లోకి రానున్నాడు. జడేజా ఉండనే ఉన్నాడు. పేస్ బౌలర్లలో సిరాజ్ కు స్థానం పక్కా. మరో స్థానం కోసం శార్దూల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, జైదేవ్‌ ఉనద్కత్‌లతో పాటు కొత్త బౌలర్‌ ముకేశ్‌ కుమార్‌ కూడా పోటీ పడుతున్నాడు. స్పినర్లలో జడేజాకు తోడుగా అక్షర్‌ పటేల్‌ను తీసుకుంటారా,  కుల్‌దీప్‌ను ఎంచుకుంటారా అన్నది చూడాలి. 


భారత్‌ తుది జట్టు అంచనా: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లి, సూర్యకుమార్‌, హార్దిక్‌, సంజు శాంసన్‌/ఇషాన్‌ కిషన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌/కుల్‌దీప్‌, శార్దూల్‌, సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌/ముకేశ్‌ కుమార్‌.
వెస్టిండీస్‌ తుది జట్టు అంచనా: కింగ్‌, మేయర్స్‌, కార్టీ, హోప్‌ (కెప్టెన్‌), హెట్‌మయర్‌, రోమన్‌ పావెల్‌, రొమారియో షెఫర్డ్‌, సింక్లయిర్‌, అల్జారి జోసెఫ్‌, మోటీ/కరియన్‌, సీల్స్‌.


Also Read: ICC ODI World Cup 2023: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రీషెడ్యూల్‌ .. కారణం ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook