India vs West Indies: నెల రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వెస్టిండీస్‌తో సమరానికి రెడీ అయింది టీమిండియా. జూలై 12 నుంచి ఆతిథ్య జట్టు కరేబీయన్ జట్టుతో 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2023) ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత భారత జట్టు ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. భారత్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్ డిజిటల్ ప్రసార హక్కులను జియో సినిమాస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లను జియో సినిమాస్ ఉచితంగా స్ట్రీమింగ్ చేయనుంది. జియో సబ్‌స్క్రైబర్లు కాకపోయినా ఉచితంగా ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. వెస్టిండీస్ పర్యటన వ్యాఖ్యానాన్ని ఇంగ్లీష్, హిందీతో పాటు భోజ్‌పురి, పంజాబీ, తమిళం, తెలుగు, కన్నడ భాషలలో వినవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెస్టిండీస్ తో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. డొమినికా వేదికగా జూలై 12 నుంచి తొలి టెస్టు మ్యాచ్ మెుదలుకానుంది. సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్‌ జులై 20 నుంచి ట్రినిడాడ్‌లో జరగనుంది. టెస్టులు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. అనంతరం జులై 27 నుంచి ఆగస్టు 1 వరకు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, ఆగస్టు 3 నుంచి ఆగస్టు 13 మధ్య 5టీ20ఐల సిరీస్‌ భారత్, వెస్టిండీస్ ల మధ్య జరగనుంది. ఈ సిరీస్‌లో చివరి 2 టీ20ఐ మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనున్నాయి. 


Also Read: ODI World Cup 2023: ట్విస్ట్ అదిరింది.. వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్‌..


వెస్టిండీస్ జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (సి), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (విసి), అలిక్ అథానాజ్, టాగెనరైన్ చందర్‌పాల్, రహ్కీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకెంజీ, రేమాన్ రీఫర్, కెమర్ రోచ్, జోమెల్ రోచ్. 


భారత జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, రితురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (విసి), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ , ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.


Also Read: Tamim Iqbal: ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న బంగ్లా కెప్టెన్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి