గౌహతిలోని బర్సపరా స్టేడియం వేదికగా ఆదివారం విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. విండీస్ నిర్దేశించిన 323 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ 4 పరుగులకే క్లీన్ బౌల్డ్ కాగా ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కోహ్లీ చెలరేగిపోయాడు. 88 బంతుల్లో (4 x 16) సెంచరీ చేసి వన్డే కెరీర్‌లో 36వ సెంచరీని నమోదు చేసుకున్నాడు.


విరాట్ కోహ్లీ దూకుడుని గమనించిన రోహిత్ శర్మ సైతం కోహ్లీకి స్ట్రైకింగ్ ఇస్తూ తన వంతు సహకారాన్ని అందించాడు. మరోవైపు రోహిత్ శర్మ సైతం కెప్టేన్‌కి సహకరిస్తూనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 33 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్ 256కి చేరుకోగా విరాట్ కోహ్లీ 107 బంతుల్లో 140 పరుగులు ( 4X21, 6X2)చేసి దేవేంద్ర బిశూ బౌలింగ్‌లో స్టంపౌట్ కాగా రోహిత్ శర్మ  87 బంతుల్లో 107 (4X11, 6X5) పరుగులు రాబట్టాడు.