T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌-2021(T20 World Cup 2021)లో భాగంగా...తొలి మ్యాచ్‌లో ఓటమి టీమిండియాకు మేలే చేస్తుందని ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌(Graeme Swann) అన్నాడు. అపజయాలు విజయాలకు బాటలు వేస్తాయని అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 24న పాకిస్తాన్‌(Pakistan)తో దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేనకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇప్పటి వరకు పాక్‌ చేతిలో అపజయం ఎరుగని భారత జట్టు అనూహ్యంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రేమ్‌ స్వాన్‌ క్రికెట్‌.కామ్‌తో మాట్లాడుతూ.. '‘కొన్ని సార్లు టోర్నీ ఆరంభంలోనే భారీ తేడాతో ఓడిపోవడం మంచే చేస్తుంది. ఎందుకంటే... ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని.. పడిలేచినా కెరటంలా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఇప్పుడే కదా ఐపీఎల్‌ ముగిసింది. వాళ్లు(టీమిండియా ఆటగాళ్లు) అలసిపోయి ఉన్నారు. అయితే, ప్రతి ఒక్కరు టీమిండియా(Teamindia)నే ఫేవరెట్‌ అంటున్నారు. వాళ్లు ఓటమి నుంచి త్వరగానే కోలుకుంటారు. ముందుకు సాగుతారు’' అని చెప్పుకొచ్చాడు.


Also Read: IND vs PAK: ఇండియాని ఓడించాక పాకిస్తాన్‌ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే...!


పాకిస్తాన్‌ ప్రదర్శన గురించి చెబుతూ... 'వాళ్లు చాలా చాలా డేంజర్‌ టీమ్‌. అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవచ్చు లేదంటే... ప్రతి మ్యాచ్‌లోనూ 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించనూ గలదు. అంతే సులువుగా టోర్నమెంట్‌ గెలవనూగలదు. పాకిస్తాన్‌ నిజంగా ప్రమాదకర జట్టు' స్వాన్‌ అభిప్రాయపడ్డాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook