చెన్నై: శ్రీలంక పై అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ..కంగారులపై కూడా అదే జోరును కొనసాగించింది. తొలివన్డేలో ఆసీస్ పై 26 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ ప్రకారం) విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్లింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించడం వల్లే ఈ గెలుపు సాధ్యపడింది. ఈ విజయంలో హార్డిక్ పాండ్యా (83) , మిస్టర్ కూల్ మహేందర్‌సింగ్ ధోనీలు కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆసీస్ ఫేస్ ధాటికి టాప్ ఆర్డర్ (రోహిత్ 28, రెహానే 4, కోహ్లీ డకౌట్, మనీష్ పాండే డకౌట్ ) కుప్పకూలింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన ధోని, పాండ్యాలు ఇన్నింగ్ ను చక్కదిద్దారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 281 పరుగుల ఛాలెజింగ్ టార్గెట్ ను ఆసీస్ ముందు ఉంచగల్గింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసీస్ బ్యాటింగ్ సమయంలో వరణుడు అటంకం కల్గించడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ను 21 ఓవర్లలో 164 పరుగులకు నిర్దేశించారు. టి 20 తరహా లక్ష్యచేదనలో హిట్లర్లు ఉన్న ఆసీస్ జట్టుకు మంచి విజయవకాశాలు కనింపించాయి. అయితే ఆసీస్ జట్టు ఆరంభం నుంచి ఈ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఇన్నింగ్ లో ఒక దశలో మ్యాక్స్ వెల్ మెరుపు బ్యాటింగ్ మాత్రం ఆసీస్ విజయంపై ఆశలు రేపింది. అయితే భారత్ బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ చేయడంతో ఆసీస్..నిర్ణీత ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో కోహ్లీ సేన 26 రన్స్ తేడాతో విజయం సాధించగల్గింది...


మ్యాచ్ హీరో ..హార్ధిక్ ప్యాండ్యా


ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ హార్ధిక పాండ్యాకు  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. బ్యాటింగ్ విభాగంలో కేవలం 66 బంతుల్లో  83 పరుగులు చేసిన హార్ధిక్.. బౌలింగ్ లోనూ రెండు వికెట్టు పడ్డగొట్టి విశేషంగా రాణించాడు. దీంతో హార్ధిక్ మ్యాచ్ హీరోగా నిల్చాడు.