ICC Rankings: భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) టీ20 ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు. తన కెరీర్ లో అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లో 838 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) ఉన్నాడు. వీరిద్దరికి మధ్య కేవలం 16 పాయింట్ల మాత్రమే తేడా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో రెండు అర్థ శతకాలు సాధించాడు. చివరి మ్యాచ్ లో కూడా బాగా ఆడి ఉంటే సూర్యకు నంబర్ వన్ ర్యాంక్ దక్కేది. మరో పక్క పాకిస్థాన్ ఆటగాడు రిజ్వాన్ ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఇరగదీశాడు. దాంతో మెుదటి ర్యాంకు అతడి వశమైంది. 


ఇక మూడో స్థానంలో కెప్టెన్ బాబర్ ఆజమ్ 801 పాయింట్లతోనూ, నాలుగో స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్కక్రమ్ 777 పాయింట్లతోనూ, ఐదో స్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ డేవిడ్ మలన్ 733 పాయింట్లతోనూ ఉన్నారు. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ 14వ ర్యాంకులో నిలిచాడు. 


Also Read: Shoaib Akhtar Comments: పాక్‌ జట్టు తొలి రౌండ్లోనే ఓడిపోతుందేమో..: షోయబ్‌ అక్తర్‌ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి