ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లను ఐసీసీ విడుదల చేసింది. విండీస్‌ గడ్డపై మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరింది. అంతకముందు 106 పాయింట్లతో పాకిస్థాన్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో టీమిండియా ఉంది. ఐతే వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 110 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

128 పాయింట్లతో కివీస్ జట్టు టాప్‌లో కొనసాగుతోంది. 119 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. మూడో ప్లేస్‌లో భారత్.. 106 పాయింట్లతో పాకిస్థాన్‌ నాలుగో స్థానంలో ఉంది. 101 పాయింట్లతో ఆస్ట్రేలియా ఐదో స్థానంలో కొనసాగుతోంది. మొత్తంగా సీనియర్ ఆటగాళ్లు లేకపోయిన యువ జట్టు అదరగొట్టింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయఢంకా మోగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌కు కరేబియన్ జట్టు గట్టి పోటీ ఇచ్చింది.


ఐతే ఆఖరి వన్డేలో మాత్రం విండీస్ జట్టు తేలిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్ భాగాల్లో విఫలమైంది. దీంతో భారత్ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి వన్డేకు వర్షం అంతరాయం కలిగించినప్పటికీ భారత్ జోరు మాత్రం ఆగలేదు. 36 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 225 పరుగులు చేసింది. గిల్, శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీలతో అలరించారు. గిల్ 98 పరుగులు చేశాడు. ఇటు శ్రేయస్ అయ్యర్ సైతం పర్వాలేదనిపించాడు.


డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 257 పరుగుల టార్గెట్ చేసేందుకు బరిలోకి దిగిన విండీస్ 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వెస్టిండీస్ ఆటగాళ్లలో బ్రాండన్ కింగ్ 42, పూరన్ 42, హోప్ 22 పరుగులు చేసి ఔట్ అయ్యారు. చహల్ 4, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ తీశారు. రేపటి నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది. 



Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోమారు వర్ష సూచన..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!


Also read:Goa Accident: గోవాలో నదిలోకి దూసుకెళ్లిన కారు..నలుగురు జల సమాధి..!  



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook