Indian Fans Says Team India did not play good cricket in T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌ 2022లో భారత్ ప్రస్థానం ముగిసిన విషయం తెలిసిందే. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలై మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో మరోసారి టీ20 టైటిల్ గెలిచే సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది.  సెమిస్ మ్యా‌చ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 16 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 170 పరుగులు చేసి దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టైటిల్ తెస్తుందనుకున్నభారత్ టీ20 ప్రపంచకప్ 2022 నుంచి నిష్క్రమించడంతో టీమిండియా క్రికెట్ అభిమానులంతా నిరాశకు గురయ్యారు. అయితే కొందరు ఫాన్స్ మాత్రం ఇంగ్లండ్‌పై భారత్ ఓడిపోవడమే మంచిదయ్యిందని అభిప్రాయపడుతున్నారు. చెత్త టీమ్‌తో ఫైనల్ చేరి.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓడిపోవడం కంటే ఇంగ్లండ్‌పై ఓటమే బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. పాక్‌పై ఓటమిని అస్సలు తట్టుకోలేకపోయేవాళ్లమని, ఆ పరాభావం మరింత దారుణంగా ఉండేదని ఫాన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


పేలవ బౌలింగ్, చెత్త ఓపెనింగ్‌తో భారత్ టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీస్‌కు చేరడమే గొప్ప విషయమని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. 'నిజాయితీగా చెప్పాలంటే.. ఈ టీT20 ప్రపంచకప్‌లో భారత్ చెత్తగా ఆడింది. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయి.. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లపై దాదాపుగా ఓడి గెలిచింది. ఇక ఇంగ్లండ్‌పై చిత్తుగా ఓడిపోయింది. నెదర్లాండ్స్, జింబాబ్వేలను మాత్రమే టీమిండియా సునాయాసంగా ఓడించింది' అని ట్వీట్ చేశాడు. 



'టీ20 ప్రపంచకప్‌ 2022లో మంచి ర్యాంక్ ఉన్న 4 జట్లతో భారత్ మ్యాచ్‌లు ఆడింది. పాక్‌పై చివరి బంతికి గెలిచింది. అందుకు విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు. దక్షిణాఫ్రికాపై ఓడిపోయింది.. బంగ్లాదేశ్‌పై చివరి బంతి వరకు మ్యాచ్ వెళ్లింది. ఇంగ్లండ్‌పై ఓడిపోయింది. గెలిచిన ఏ మ్యాచ్‌లోనూ భారత్ అద్భుత ప్రదర్శన లేదు. జట్టుగా ప్లేయర్స్ అదృష్టవంతులు' అని మరొకరు ట్వీట్ చేశారు. 'ఇలాంటి ప్లేయర్లతో సెమీస్ వరకు రావడమే గొప్ప విషయం. పాక్‌పై ఓడిపోవడం కంటే.. ఇంగ్లండ్‌పై ఓటమే బెటర్'అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.



Also Read: VVS Laxman Head Coach: రాహుల్ ద్రవిడ్ ఔట్.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌!  


Also Read: సీనియర్‌ ఆటగాళ్లు రిటైర్మెంట్లు ఇవ్వొచ్చు.. టీమిండియా తదుపరి కెప్టెన్‌ అతడే: గవాస్కర్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook