Rohit Sharma, Jasprit Bumrah named Wisden Five Cricketers of the Year: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాలకు అరుదైన గౌరవం దక్కింది. విజ్డన్ 2022 టాప్ 5 క్రికెటర్స్ జాబితాలో ఈ ఇద్దరికి చోటు దక్కింది. గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు రోహిత్, బుమ్రాలకు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరి భారత ఆటగాళ్లతో పాటుగా మరో ముగ్గురు ప్లేయర్స్‌ను విజ్డన్ ఎంపిక చేసింది. అయితే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి మాత్రం చోటు దక్కలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజ్డన్ 2022 టాప్ 5 క్రికెటర్స్ జాబితాలో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలతో పాటు న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డేవాన్ కాన్వే, ఇంగ్లండ్‌ పేసర్‌ ఓలీ రాబిన్సన్, దక్షిణాఫ్రికా మహిళా కెప్టెన్‌ డాన్ వాన్ కికెర్క్ ఎంపికయ్యారు. లీడింగ్‌ క్రికెటర్‌ ఇన్‌ ద వరల్డ్‌ 2022 ఎడిషన్‌ అవార్డును ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ సొంతం చేసుకున్నాడు. ఈ వివరాలను విజ్డన్ ఎడిటర్ లారెన్స్ బ్రూత్ ఓ ప్రకటనలో వెల్లడించారు.


ఇంగ్లండ్ గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించారని విజ్డన్ ఎడిటర్ లారెన్స్ బ్రూత్ పేర్కొన్నారు. 'గతేడాది వేసవిలో ఇంగ్లండ్ గడ్డపై భారత్ రెండు టెస్ట్‌లు గెలవడంలో రోహిత్, బుమ్రాలు కీలక పాత్ర పోషించారు. లార్డ్స్ టెస్ట్‌లో మూడు వికెట్లు, ఓవల్ టెస్ట్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్‌లో వర్షం అంతరాయం కలిగించకుంటే బుమ్రా 9 వికెట్లతో భారత్ గెలిచేది. నాలుగు టెస్ట్‌ల్లో బుమ్రా 18 వికెట్లు పడగొట్టాడు. ఇక కీలక పరుగులు కూడా చేశాడు' అని విజ్డన్ ఎడిటర్ తెలిపారు.


'ఇంగ్లీష్ గడ్డపై భారత్ సాధించిన ఈ రెండు విజయాలలో రోహిత్ శర్మదే కీలక పాత్ర. లార్డ్స్‌లో అద్భుతంగా ఆడాడు. బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించని వికెట్‌పై 83 పరుగులు చేశాడు. ఓవల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 127 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో మొత్తం రోహిత్ 368 పరుగులు చేశాడు' అని విజ్డన్ ఎడిటర్ లారెన్స్ బ్రూత్ చెప్పుకొచ్చారు. 


Also Read: KGF 2 Collection: రాజమౌళిని వెనక్కినెట్టిన ప్రశాంత్ నీల్? ఆర్ఆర్ఆర్ రికార్డును కొల్లగొట్టిన KGF 2!


Also Read: Acharya Movie Update: మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'ఆచార్య' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.