IPL 2021: మళ్లీ ఐపీఎల్ పండగ వచ్చేసింది...ఇవాళ్టి నుంచి రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం
IPL 2021: క్రికెట్ ప్రియులను అలరించేందుకు ఐపీఎల్ మళ్లీ వచ్చేసింది. యూఏఈ వేదికగా ఆదివారం ఐపీఎల్-14 సీజన్ రెండో దశ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి గం.7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
IPL 2021: క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మరోసారి సిద్దమైంది. కరోనా(Covid-19) దెబ్బతో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్...నేడు యూఏఈ(UAE) వేదికగా పునః ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(chennai superkings) జట్లు తలబడనున్నాయి. మ్యాచ్‌లన్నీ దుబాయ్, అబుదాబీ, షార్జా క్రికెట్ స్టేడియాల్లో జరగనున్నాయి. ఐపీఎల్ ఆగిపోయే సమయానికి ఢిల్లీ, చెన్నై జట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఒక్కో సీజన్ ఐపీఎల్(IPL)లో ప్లే ఆఫ్స్ సహా మొత్తం 60 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ అర్ధాంతరంగా ఆగిపోయే సమయానికి 29 మ్యాచ్‌లు ముగిశాయి. అంటే 27 రోజుల్లో మిగిలిన 31 మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించనుంది. తొలి దశతో పోలిస్తే వేదికలు మారడమే కాకుండా పలు జట్లలో కూడా మార్పులు జరిగాయి. వ్యూహ ప్రతివ్యూహాల్లో కూడా ఆ తేడా కనిపిస్తుంది.
Also Read: IPL 2021 Hundred Crores Club: ఐపీఎల్ 2021 వందకోట్ల క్లబ్‌లో టాప్ 5 ఆటగాళ్లు, వారి సంపాదన వివరాలు
కాబట్టి తొలి దశలో జోరు ప్రదర్శించిన జట్లు ఇక్కడా దానినే కొనసాగించగలవా లేదా అనేది ఆసక్తికరం. పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న టీమ్‌లు కూడా పుంజుకునేందుకు ఆస్కారం ఉంది. అక్టోబర్ 8వ తేదీన లీగ్ స్టేజి చివరి మ్యాచ్ కాగా, అక్టోబర్ 10న మొదటి క్వాలిఫైయర్, అక్టోబర్ 11, 13వ తేదీల్లో ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 15న ఫైనల్ మ్యాచ్ జరగునుంది. ఈ మ్యాచ్‌లలో స్థానిక ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తుండటం విశేషం.
టోర్నీకి కీలక ఆటగాళ్లు దూరం..
కొన్ని జట్లలోని కొందరు కీలక ఆటగాళ్లు ఇప్పటికే టోర్నీకి దూరమయ్యారు. తొలి దశలో ఆడిన ప్యాట్ కమిన్స్ (కోల్‌కతా), స్టోక్స్, బట్లర్ (రాజస్తాన్), బెయిర్‌స్టో (సన్‌రైజర్స్), వోక్స్ (ఢిల్లీ), వాషింగ్టన్ సుందర్ (బెంగళూరు) వేర్వేరు కారణాలతో ఇప్పుడు బరిలోకి దిగడం లేదు. తొలి దశ పోటీలకు దూరమైన శ్రేయస్ అయ్యర్, నటరాజన్ ఈసారి ఆడనుండగా... షమ్సీ, హసరంగ, చమీరా, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ ఎలిస్, రషీద్, టిమ్ డేవిడ్, లూయీస్‌లాంటి ఆటగాళ్లు ఐపీఎల్‌లో కొత్తగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook