PV Sindhu appointed BWF Athletes Commission member till 2025: మాజీ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్, తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu)కు అరుదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) అథ్లెట్​ కమిషన్ సభ్యురాలిగా సింధు సోమవారం ఎంపికయ్యారు. బీడబ్ల్యూఎఫ్​ అథ్లెట్ కమిషన్​ 2021-25కి గాను ఆరుగురు సభ్యులను ప్రకటించింది. అందులో మన భారత షట్లర్ సింధు ఒకరు. మిగతా ఐదుగురు సభ్యులతో కలిసి 2025 వరకు సింధు బీడబ్ల్యుఎఫ్‌లో సేవలు అందించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐరిస్ వాంగ్ (USA), రాబిన్ టాబెలింగ్ (NED), గ్రేసియా పోలి (INA), కిమ్ సోయోంగ్ (KOR), పీవీ సింధు (IND), జెంగ్ సి వీ (CHN)లను బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (Badminton World Federation) అథ్లెట్స్ కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ ఆరుగురు సభ్యులలోనే ఛైర్మన్​, డిప్యూటీ ఛైర్మన్​ను నిర్ణయిస్తారు. బీడబ్ల్యుఎఫ్‌ అథ్లెట్స్ కమిషన్ (BWF Athletes Commission) 2021-25 కోసం ఆరుగురు సభ్యులను ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని బీడబ్ల్యుఎఫ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 


Also Read: IAS Officer Cooking: స్టవ్‌ వెలిగించకుండా.. వంట చేసే సత్తా ఆ ఐఏఎస్‌ అధికారికి మాత్రమే ఉంది!!


2016లో రియో ​​ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu).. టోక్యో ఒలింపిక్స్ 2021లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు కాంస్యాలు, రెండు రజతాలతో పాటు ప్రతిష్టాత్మకమైన స్వర్ణాన్ని కూడా ఆమె గెలుచుకున్నారు. తాజాగా ముగిసిన బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో సింధు ఫైనల్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. టైటిల్‌ పోరులో ప్రపంచ ఆరో ర్యాంకర్ యాన్ సియాంగ్‌ (దక్షిణకొరియా) చేతిలో సింధు వరుస సెట్లలో 16-21, 12-21 తేడాతో ఓటమిపాలయ్యారు. 


Also Read: Peng Shuai: నాపై లైంగిక దాడి జ‌ర‌గలేదు.. యూటర్న్‌ తీసుకున్న టెన్నిస్ స్టార్!!




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి