Dipika Pallikal eyes TOPS funding after winning the title in Glasgow: భారత స్క్వాష్‌ స్టార్‌ దీపికా పల్లికల్‌ కార్తీక్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటిన విషయం తెలిసిందే. టీమిండియా క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ను పెళ్లి చేసుకుని కవల పిల్లలకు జన్మనిచ్చిన దీపికా దాదాపు మూడేళ్లు ఆటకు దూరంగా ఉన్నా.. తన ఆటలో పదును తగ్గలేదని నిరోపించారు ప్రసవం అనంతరం ఆరు నెలలకే డబ్ల్యూఎస్‌ఎఫ్‌ ప్రపంచ డబుల్స్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు టైటిళ్లు గెలిచి పునరాగమనం అంటే ఇలా ఉండాలని ప్రపంచానికి చాటిచెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం (ఏప్రిల్ 9) గ్లాస్గోలో జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో దీపిక పల్లికల్‌-సౌరవ్‌ ఘోషల్‌ జోడి 11-6, 11-8తో అడ్రియన్‌ వాలెర్‌-అలీసన్‌ వాటెర్స్‌ (ఇంగ్లండ్‌) ద్వయంపై విజయం సాధించింది. ఆ వెంటనే జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో దీపిక-జోష్న చినప్ప జోడి 11-9, 4-11, 11-8తో సారా పెర్రీ-అలీసన్‌ వాటెర్స్‌ (ఇంగ్లండ్‌) జోడీపై గెలిచి రెండో టైటిల్‌ కైవసం చేసుకుంది. 2018 అక్టోబర్ తర్వాత దీపిక పాల్గొన్న తొలి ఈవెంట్ ఇదే కావడం విశేషం.


ఈ ప్రదర్శనతోనైనా తమ పేర్లు క్రీడా మంత్రిత్వ శాఖ యొక్క టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)లో చేర్చాలని దీపిక, జోష్న, సౌరవ్‌ అభిలాషిస్తున్నారు. సెప్టెంబర్ 2014లో ఒలింపిక్ క్రీడలలో ఎలైట్ అథ్లెట్లకు మద్దతు ఇవ్వడానికి టాప్స్‌ ఏర్పాటు చేయబడింది. ఆపై కామన్వెల్త్ గేమ్స్ మరియు ఆసియా క్రీడలు, స్క్వాష్ వంటి నాన్-ఒలింపిక్ క్రీడలకు చెందిన ఆటగాళ్లకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. టాప్స్‌కు ఎంపికైన అథ్లెట్లకు నెలకు రూ.50,000 స్టైఫండ్ లభిస్తుంది. అథ్లెట్ల పోటీ మరియు శిక్షణ కోసం ఈ నిధులను విడుదల చేస్తారు. 


ఇది మాకు పెద్ద విజయం కాబట్టి మమ్మల్ని టాప్స్‌లో చేర్చుతారని ధీమాగా ఉన్నామని సౌరవ్‌ ఘోషల్‌ అన్నారు. ఇది జరిగితే తమకు చాలా సహాయంగా ఉంటుందన్నారు. మమ్మల్ని ఇంకా ఎందుకు చేర్చుకోలేదో తెలియదు కానీ అది త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నాను అని సౌరవ్‌ పేర్కొన్నారు. టాప్స్‌ ఎల్లప్పుడూ అథ్లెట్లకు శిక్షణ మరియు టోర్నమెంట్‌ల కోసం నిధులను అందిస్తుందని, తమకు కూడా నిధులు సమకూర్చినట్లయితే చాలా సహాయంగా ఉంటుందని దీపిక అన్నారు. 


Also Read: Walking Benefits: భోజనం చేసిన తర్వాత.. నడవడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!


Also Read: Yuzvendra Chahal: అది ఎలా వైడ్ అవుద్ది.. అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన యుజ్వేంద్ర చహల్ (వీడియో)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook