India Clinches T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఒక్క ఓటమి లేకుండా దూకుడుగా ఆడిన భారత్‌ తుది పోరులోనూ అదే ప్రదర్శనను కొనసాగించి ప్రపంచప్‌ను చేజిక్కించుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఆటగాళ్లు మాత్రం గొప్ప స్ఫూర్తితో ఆడి విదేశీ గడ్డపై భారత జెండాను రెపరెపలాడించారు. గతానికి విభిన్నంగా బ్యాటింగ్‌ చేసిన విరాట్‌ కోహ్లీ, అదే తీరున బౌలర్లు అనూహ్య ప్రదర్శన కనబర్చి జట్టును విజయతీరాలకు చేర్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: T20 World Cup 2024 Live: వరల్డ్‌ కప్‌ లైవ్‌ అప్‌డేట్స్‌.. సాహో భారత్.. టీ 20 ప్రపంచకప్ మనదే


 


బార్డరోస్‌ వేదికగా శనివారం జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌లో టాస్‌ నెగ్గిన భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లను కోల్పోయి 176 పరుగులు సాధించింది. ఓపెనర్‌గా వచ్చిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ 18వ ఓవర్‌ వరకు నిలబడ్డాడు. 59 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో నిలకడైన ఆటతో జట్టుకు భారీ పరుగులు ఇచ్చాడు. కోహ్లీ నుంచి ఇలాంటి ప్రదర్శన చాలా ఏళ్ల కిందట చూశాం. రోహిత్‌ శర్మ (9) ఔటవగా.. పంత్‌ డకౌట్‌తో వెనుదిరగగా.. సూర్య కుమార్‌ యాదవ్‌ 3 పరుగులు మాత్రమే చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అక్షర్‌ పటేల్‌ విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 31 బంతుల్లో 47 పరుగులు చేశాడు. యువ బ్యాటర్‌ శివమ్‌ దూబే (27), హార్దిక్‌ పాండ్యా (5), రవీంద్ర జడేజా (2) కొన్ని పరుగులు రాబట్టారు.

Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ భారత్‌దే అనిపిస్తున్నా.. దక్షిణాఫ్రికా 'కంగారు'లా పెట్టిస్తుందా?


 


కీలకమైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ప్రారంభంలో బంతులతో భారత్‌ పరుగులకు కళ్లెం వేసింది. కానీ ఓవర్లు పూర్తవుతున్న కొద్ది బౌలర్లు తేలిపోయారు. పవర్‌ ప్లేలో భారత్‌ను నియంత్రించిన సఫారీలు అనంతరం పరుగులు సమర్పించుకున్నారు. కేశవ్‌ మహారాజ్‌ 2, అన్రిచ్‌ నోర్ట్జే 2 చొప్పున వికెట్లు తీశారు. కగిసో రబాడా, మార్కో జెన్సన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.


ప్రపంచకప్‌ ఫైనల్స్‌లోనే అత్యధిక స్కోర్‌ అయిన 177 లక్ష్యాన్ని చేధించడానికి దక్షిణాఫ్రికా రంగంలోకి దిగింది. సఫారీలను విజయం ఊరించి ఊరించి దూరమైపోయింది. 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి దక్షిణాఫ్రికా రన్నరప్‌గా నిలిచింది. పవర్‌ ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయి నష్టాల్లోకి వెళ్లింది. రీజా హెండ్రిక్స్‌ (4), ఐడెన్‌ మార్‌క్రమ్‌ (4), కగిసో రబాడా (4), మార్కో జెన్‌సేన్‌ (2) అతి తక్కువ పరుగులే చేయగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ తీవ్రంగా శ్రమించాడు. 27 బంతుల్లో 52 పరుగులు చేశాడు. క్వింటాన్‌ డికాక్‌ (39) దూకుడుగా ఆడగా.. త్రిస్టన్‌ స్టబ్స్‌ (31), డేవిడ్‌ మిల్లర్‌ (21) పోరాడినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు.


భారత్‌ భళా
బ్యాటర్లు నిలిపిన లక్ష్యాన్ని భారత బౌలర్లు తమ పొదుపైన బౌలింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించారు. ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అద్భుతమైన బౌలింగ్‌ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పాండ్యా తీసిన వికెట్‌ మ్యాచ్‌ను కీలక మలుపు తిరిగింది. ఇక కళ్లు చెదిరే రీతిలో మరోసారి జస్‌ప్రీత్‌ బుమ్రా మాయ చేసి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్‌ సింగ్‌ కూడా kugci కీలకమైన వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్‌ కూడా ఒకటి తీశాడు.


విజయం ఊగిసలాట
సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైనప్పటి నుంచి విజయం అనేది ఊగిసలాట ఆడింది. 15 ఓవర్ల వరకు విజయం అనేది దక్షిణాఫ్రికా వైపు మళ్లింది. ఆ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వేసిన ఎత్తులకు దక్షిణాఫ్రికా చిత్తయి భారత్‌ ట్రోఫీని ముద్దాడింది. ఇక ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ బౌండరీ లైన్‌లో పట్టిన క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌. ఈ విజయంతో విదేశీ గడ్డపై భారత జెండాను రోహిత్‌ శర్మ గర్వంగా పాతాడు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter