CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో మహిళల భారత జట్టు ఓడిపోయింది. భారత్‌పై ఆసీస్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. భారత కెప్టెన్ కౌర్ హాఫ్‌ సెంచరీతో అలరించింది. 34 బంతుల్లో 52 పరుగులు చేసింది. ఇందులో 8 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది. మరో ప్లేయర్ షెఫాలీ వర్మ పర్వాలేదనిపించింది. 33 బంతుల్లో 44 పరుగులు సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో 9 ఫోర్లు ఉన్నాయి. 155 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఆ జట్టు టాప్‌ ఆర్డర్ విఫలమైన..మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు ఆకట్టుకుంటున్నారు. ఆష్లీ హాఫ్‌ సెంచరీ చేసింది. 35 బంతుల్లో 52 పరుగులు సాధించింది. ఇందులో 9 ఫోర్లు ఉన్నాయి. హారిస్ సైతం 20 బంతుల్లో 37 పరుగులు చేయడంతో టార్గెట్‌ను సునాయాసంగా చేధించింది. హారిస్ 5 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.



Also read:Wrong Challan: ఇలా చేస్తే.. మీ చలాన్‌లు కట్టాల్సిన అవసరం లేదు!


Also read:God Father: సల్మాన్ తో కలిసి చిందేయనున్న చిరు.. కన్నుల పండుగే అంటూ ట్వీట్



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook