India Women vs Bangladesh Women, Asia Cup 2022: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఓటమి అనంతరం భారత వుమెన్స్ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది. కీలకమైన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియాకు దాదాపు సెమీఫైనల్ బెర్త్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మన అమ్మాయిలు ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బంగ్లాతో మ్యాచ్ లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్కు విశ్రాంతినిచ్చి.. మంధానకు సారథిగా బాధ్యతలు అప్పగించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెుదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ స్మృతీ మంధాన 38 బంతుల్లో 47 పరుగులు, షఫాలీ వర్మ 44 బంతుల్లో 55 పరుగుల చేసి జట్టుకు మంచి ఆరంభానిచ్చారు. వీరిద్దరూ తొలి  వికెట్ కు 96 పరుగులు జోడించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగ్స్ 24 బంతుల్లో 35 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. జట్టు భారీ స్కోర్ చేయడంలో ఈమె కీలకపాత్ర పోషించింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో రుమానా అహ్మద్ 3 వికెట్లు తీసింది. 


160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 6 వికెట్లు కోల్పోయి 100 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా ఆటగాళ్లు స్కోర్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. బంగ్లా ఆటగాళ్లలో నిగర్ సుల్తానా (36), ఫర్గానా హక్ (30), ముర్షిదా ఖాతున్ (21) రాణించారు. దీప్తి శర్మ, షఫాలీ చెరో 2 వికెట్లు తీశారు. రేణుకా సింగ్, స్నేహ్‌ రాణా ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న అతిపిన్న వయస్కురాలిగా షఫాలీ వర్మ (Shafali Verma) రికార్డు సృష్టించింది. ఇంతకముందు ఈ రికార్డు జెమీయా రోడ్రిగ్స్ పేరిట ఉండేది. 


Also Read: David Miller's Daughter: డేవిడ్ మిల్లర్ కూతురు చనిపోయిందనే వార్తల్లో నిజం ఎంత ? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి