India’s batting coach: టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ పదవికి విక్రమ్ రాథోడ్ మరోసారి దరఖాస్తు
Vikram Rathore: భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ పదవికి.. ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న విక్రమ్ రాథోడ్ మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే బీసీసీఐ ఈ ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుంది.
India’s batting coach: టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ (Team India battiing Coach) పదవికి మరోసారి దరఖాస్తు చేసుకున్నారు విక్రమ్ రాథోడ్.
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడే (Batting Vikram Rathore) ఉన్నారు. అయితే త్వరలో ప్రస్తుత పదవీ కాలం ముగియనుండటంతో.. మరోసారి దరఖాస్తు చేసినట్లు విక్రమ్ అధికారికంగా ప్రకటించారు.
ప్రధాన కోచ్‌తో సహా బ్యాటింగ్, బౌలింగ్ కోచ్ పదవులకు గత నెల బీసీసీఐ (BCCI on Coach selection) దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే విక్రమ్ మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. బీసీసీఐ త్వరలోనే అన్ని దరఖాస్తులను పరిశీలించి ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది.
మరోసారి బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికైతే అమలు చేయాల్సిన కార్యచరణ చాలానే ఉందంటూ విక్రమ్ రాథోడ్ (Vikram on re selection as Batting Coach) చెప్పుకొచ్చారు.
హెచ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ ఎంపిక లాంఛనమే?
టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పదవికి రాహుల్ ద్రవిడ్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. రవి శాస్త్రి తర్వాత ద్రవిడ్ ఎంపిక లాఛనమే కానుంది.
ద్రవిడ్ ఎంపికపై బీసీసీఐ అధికారి ఒకరు ఇదివరకే కీలక ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత రవి శాస్త్రి కోచ్ బాధ్యల నుంచి తప్పుకుంటారని.. ఆ తర్వాత రాహుల్ ఆ పదవిని చేపడతారని వెల్లడించారు. న్యూజిలాండ్ టూర్ నుంచి 2023 వన్డే ప్రపంచ కప్ వరకు ద్రవిడ్ కొనసాగుతారని కూడా వివరించారు. తదుపరి హెడ్‌కోచ్ ఎంపికపై బీసీసీఐ పూర్తి క్లారిటీతో ఉన్నట్లు తెలిస్తోంది.
అయితే బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్‌ల ఎంపికపై ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ దరఖాస్తును బీసీసీఐ మరోసారి ఆమోదిస్తుందా? అనేది వేచి చూడాలి. ఇక ప్రస్తుతం భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ ఉన్నారు.
విక్రమ్ రాథోడ్ నేపథ్యం..
విక్రమ్ రాథోడ్ 1969 మార్చి 26న జన్మించారు. భారత్ తరఫున 6 టెస్టులు, 7 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించారు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన విక్రమ్.. 146 మ్యాచ్‌ల్లో 11473 పరుగులు సాధించారు. ఆయన సగటు 49.66 పరుగులు. 2003లో విక్రమ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook