Fans Fight:  క్రీడల్లో పోటీ హోరాహోరీగా సాగుతుంటుంది. విజయం కోసం ఇరుజట్లు చివరి వరకు పోరాడుతాయి. మ్యాచ్ ఆడుతున్నంత సేపు ఆటగాళ్లు తమ ప్రత్యర్థులతో భీకరంగా పోరాడుతారు. మ్యాచ్ ముగియగానే అంతా ఫ్రెండ్లీగా మారిపోయి క్రీడా స్పూర్తిని చాటుకుంటారు. కాని అభిమానులు మాత్రం తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగియగానే స్టేడియాల్లో అల్లర్లకు దిగుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగాల్సి వస్తోంది. అల్లర్లను కంట్రోల్ చేసే సమయంలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఫ్యాన్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆట సందర్భంగా స్టేడియంలో జరిగిన అల్లర్లలో ఇప్పటివరకు 8 వందల మందికి పైగా చనిపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఇండోనేషియా తూర్పు జావా ప్రాంతంలోని  కంజురుహన్ స్టేడియంలో జరిగిన ఇండోనేషయన్ లీగ్ ఫుట్ బాల్ మ్యాచ్ లో అల్లర్లు జరిగాయి. సురబయ పెర్సెబయ  జట్టు చేతిలో అరెమా టీమ్ ఓడిపోయింది. దీంతో ఆ జట్టు అభిమానులు వీరంగం స్పష్టించారు. ప్రత్యర్థి జట్టు అభిమానులతో గొడవకు దిగారు. ఇరు జట్ల అభిమానులు స్టేడియంలో తీవ్రంగా కొట్టుకున్నారు. ఫైటింగ్ ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగి మొత్తం 129 మంది చనిపోయారు.ఈ ఘటన ఇండోనేషియాలో పెను విషాదం నింపింది.


1964 మే 24 పెరులో పెను విషాదం జరిగింది. లీమ నగరంలోని ఫుట్‌బాల్‌ స్టేడియంలో  అర్జెంటీనా, పెరు మధ్య మ్యాచ్ జరిగింది. చివరలో గోల్ వివాదమైంది. దీంతో  అభిమానులు స్టేడియంలో దూసుకొచ్చారు. అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. స్టేడియం గేట్లు మూసివేయడంతో బయటికి వెళ్లే దారి లేక జరిగిన తొక్కిసలాటతో 328 మంది దుర్మరణం చెందారు.


1980, జవనరి 20న కొలంబియాలో మరో విషాదం జరిగింది.  సిన్స్‌లెజోలో బుల్‌ఫైట్‌ చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్.. స్టేడియం కూలిపోవడంతో విగతజీవులుగా మారారు. నాలుగంతస్తుల తాత్కాలిక స్టేడియం కూలిపోవడంతో.. వాటి శిథిలాల కింద చిక్కుకుని 2 వందల మంది మరణించారు. ఇక మార్చి 13, 1988లో జరిగింది మరో విపత్తు.  వడగళ్ల వర్షం 93 మందిని బలి తీసుకుంది. ఖాట్మాండులో నేపాల్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ జరుగుతుండగా.. ఒక్కసారిగా వచ్చిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. అభిమానులు బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా తొక్కిసలాట జరగడంతో ఈ ఘోరం జరిగింది.


1989, ఏప్రిల్‌ 15న యూకేలో జరిగింది మహా విషాదం. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారో ఇప్పటికి ఖచ్చితంగా తెలియదని చెబుతున్నారు. హిల్స్‌బర్గ్‌ స్టేడియంలో లివర్‌పూల్‌- నాటింగ్‌హాం జట్లు తలపడ్డాయి. అయితే మ్యాత్ చూసేందుకు గ్రౌండ్ కెపాసిటీకి మంచి జనాలు వచ్చారు. స్టేడియంలో ప్లేస్ లేకపోవడంతో నిర్వాహకులతో గొడవ పడ్డారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 96 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడు వందల మందికి పైగా గాయపడ్డారని అధికారుల లెక్క. కాని అంతకంటే ఎక్కువ మంది గాయపడ్డారని చెబుతారు. ఈ ఘటనకు గుర్తు చేసుకుంటూ లివర్‌పూల్‌ జట్టు ఆటగాళ్లు జర్సీ కాలర్‌పై 96 నెంబర్‌ ముద్రించుకుంటారు.


గ్వాటెమాలా సిటీలో 1996, అక్టోబర్‌ 16న తొక్కిసలాటలో 84 మంది అభిమానులు చనిపోయారు. గ్వాటెమాలా, కోస్టారికా మధ్య ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన జరిగింది. 2001, మే9న ఘనా రాజధాని అక్రాలో జరిగిన తొక్కిసలాటలో 120 మంది దుర్మరణం చెందారు.  మ్యాచ్ జరుగుతుండగా ఫ్యాన్స్ స్టేడియంలోకి  వాటర్ బాటిళ్లు విసిరారు. దీంతో వాళ్లను కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి