Team India beat Bangladesh by 59 runs in Womens Asia Cup T20 2022: మహిళల ఆసియా కప్‌ 2022లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచులో పాకిస్తాన్ చేతిలో ఓడిన భారత్.. నేడు బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల దెబ్బకు బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 100 పరుగులే చేసింది. దాంతో భారత్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్ సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకొంది. ప్రస్తుతం భారత్‌ ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు ఫర్గానా హక్ (30), ముర్షిదా ఖాతున్ (21) ఆచితూచి ఆడారు. ముర్షిదాను స్నేహ రానా ఔట్ చేయడంతో 45 పరుగుల బాగస్వామ్యంకు తెరపడింది. ఫర్గానాతో పాటు రుమానా అహ్మద్ (0) పెవిలియన్ చేరడంతో బంగ్లా కష్టాలో పడింది. అయితే నిగర్ సుల్తానా (36) ఒంటరి పోరాటం చేసినా.. ఆమెకు అండగా నిలిచే బ్యాటర్లు కరువయ్యారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించడంతో.. బంగ్లా ఏ దశలోనూ విజయం వైపు సాగలేకపోయింది. టీమిండియా బౌలర్లు షఫాలీ వర్మ 2, దీప్తి శర్మ 2 తలో రెండు వికెట్లు పడగొట్టారు. 



అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (55) అర్ధ శతకం సాధించగా.. కెప్టెన్‌ స్మృతీ మంధాన (47) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. ఆ తర్వాత  రోడ్రిగ్స్‌ (35 నాటౌట్) కూడా రాణించింది. రిచా ఘోష్‌ (4), కిరన్ నవ్‌గిరె (0) విఫలం కాగా.. ఇన్నింగ్స్ చివరలో దీప్తి శర్మ 10 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో రుమానా అహ్మద్ 3 వికెట్స్ పడగొట్టింది. 


Also Read: కాటేయడానికి పరుగెత్తుకొచ్చిన 13 అడుగుల కింగ్ కోబ్రా.. ఈ వ్యక్తి ఎంత ఈజీగా హ్యాండిల్ చేశాడో చూడండి!


Also Read: ప్రపంచకప్‌లు వస్తుంటాయి పోతుంటాయి.. అతడు మరోసారి గాయపడితే కెరీర్‌కే ప్రమాదం: సల్మాన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook