Charlie Dean reacts on Deepti Sharma Mankading: భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ మన్కడింగ్‌ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్‌ చార్లీ డీన్‌ దడుసుకునట్లు ఉంది. ఇక నుంచి తాను నా క్రీజులోనే ఉంటానని సోషల్ మీడియా వేదికగా స్వయంగా చెప్పింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో చార్లీ డీన్‌ను దీప్తి శర్మ మన్కడింగ్‌ చేసిన విషయం తెలిసిందే. బంతిని వేయడానికి ముందే అనేక సార్లు డీన్‌ క్రీజును వదిలి వెళ్లడంతో దీప్తి రనౌట్ చేసింది. ఈ మన్కడింగ్‌ వ్యవహారం ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రనౌట్‌ వివాదంపై ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్ హీథర్‌ నైట్ ఇప్పటికే స్పందించింది. 'మ్యాచ్‌ అయిపొయింది. నిబంధనల ప్రకారమే చార్లీ ఔట్ అయింది. రనౌట్‌ విషయంలో భారత ప్లేయర్స్ మమ్మల్ని హెచ్చరించారనడంలో వాస్తవం లేదు. నిజానికి భారత జట్టు చేసింది తప్పు కాదు. కాబట్టి వారు హెచ్చరించాల్సిన అవసరం లేదు. అయితే తాము చేసిన దానిని సమర్థించుకోవడం కోసం హెచ్చరిక అనే ఒక పదాన్ని మాత్రం వాడుకోవడం సమంజసం కాదు' అని హీథర్‌ నైట్ అంది. 



మన్కడింగ్‌ వ్యవహారంపై తాజాగా చార్లీ డీన్‌ స్పందించింది. 'వేసవికి ఇది ఆసక్తికర ముగింపు. ఇంగ్లండ్ జెర్సీలో లార్డ్స్‌ మైదానంలో ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇక నుంచి నేను నా క్రీజులోనే ఉంటానని అనుకుంటున్నా' అని చార్లీ డీన్‌ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. 'చార్లీ డీన్‌ బయపడింది' బయపడింది అని ఒకరు ట్వీట్ చేయగా.. 'చార్లీ డీన్‌ దెబ్బకు జడుసుకుంది' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 


Also Read: IND vs SA: దక్షిణాఫ్రికాతో భారత్ సిరీస్.. వైస్‌ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌!


Also Read: ఎన్బీకే 107 నుంచి వీడియో లీక్.. పప్పులో కాలేశారా.. ఇదెక్కడి లాజిక్ రా అయ్యా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook