కొహ్లీ కాలికి గాయం అయ్యింది. దీంతో తదుపరి టీ20 మ్యాచ్ లో విరాట్ ఆడుతాడా?లేదా? అనే సందిగ్దత నెలకొంది.  ఆదివారం జోహాన్నెస్బర్గ్ లోసౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్ లో విరాట్ కొహ్లీ గాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాస్ ఓడి టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. ఈ నేపథ్యంలోనే కొహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా కాలికి గాయం అయ్యింది. కాలినొప్పితో బాధపడుతున్న కొహ్లీ, సంషి బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. తరువాత ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కాలినొప్పి మరీ ఎక్కువ కావడంతో 13వ ఓవర్లో మైదానం వీడారు.


మ్యాచ్ ముగిశాక కొహ్లీ మాట్లాడుతూ.. 'అదృష్టవశాత్తు చేతికి ఎటువంటి గాయం కాలేదు. కాలి గాయం కాస్త ఇబ్బంది పపెడుతోంది' అని తెలిపాడు.


ఇరుజట్ల మధ్య బుధవారం సిరీస్ లో భాగంగా రెండో టీ20 జరగనుంది. ఒకవేళ కాలి నొప్పి ఎక్కువైతే కొహ్లీ ఈ మ్యాచ్ కు దూరం కావచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరిస్తారు.