ముంబై : ముంబైలోని బీసీసీఐ కార్యాలయాలయంలో టీమిండియా కోచ్‌ పదవికి ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. కపిల్‌దేవ్‌ ఆధ్వర్యంలోని అన్షుమాన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామిల క్రికెట్‌ సలహా మండలి ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు జట్టుకు ప్రధాన కోచ్ పదవి కోసం పదుల సంఖ్యలో దరఖాస్తులు రాగా అందులో ఆరుగురిని మాత్రమే ఇంటర్వ్యూలకు ఎంపిక చేసి ఇంటర్యూకు రమ్మని ఆహ్వానించారు. ఇందులో భాగంగా ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో సహా మాజీ క్రికెటర్‌ రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, మైక్‌ హెస్సన్‌, టామ్‌మూడీ, ఫిల్‌ సిమ్మన్స్‌ తదితరులు ఇంటర్వ్యూ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఒకరిద్దరిని ఇంటర్వ్యూ చేసినట్లు సమాచారం. సాయంత్రానికి కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి  కొత్త కోచ్‌ని ఎంపిక చేసే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రవిశాస్త్రికి పగ్గాలు దక్కేనా ?


ప్రస్తుతం కోచ్ గా బాధ్యతలు వహిస్తున్న రవిశాస్త్రి భారత జట్టును ఎప్పుడూ లేని విధంగా విజయపథంలో నడిపిస్తున్నాడు. అయితే వరల్డ్ కప్ లో సెమీస్ వరకు వెళ్లి టీమిండియా ఓటమి పాలవడం..దానికి బ్యాటింగ్ ఆర్డర్ ఎంపికే కారణమంటూ కోచ్ రవిశాస్త్రిపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తిరిగి ఆయన ఎంపిక జరగబోదని పలువురు సీనియర్లు అభిప్రాయపడుతున్నాయి. మరి కొందరు మాత్రం టీమిండియా ఎన్నడూ లేని స్థాయిలో విజయాలు అందించడంలో రవిశాస్త్రి కీలక పాత్ర పోషించాడని..వాటిని పరిగణనలోకి తీసుకొని మళ్లీ ఆయన్నే కోచ్ గా ఎంపిక చేస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు


ఆ ఆరుగురిలో ఎవరికి దక్కేను ?


ఇతర సభ్యుల విషయానికి వస్తే వివాదరహితుడిగా..అందరినీ కలుపుపోయే తత్వం కలిగిన టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రాబిన్ సింగ్ కు బరిలో ఉంటడం ఉత్కంఠత రేపుతోంది. గతంలో కూడా పోటీలో నిలిచినప్పటికీ అప్పట్లో రవిశాస్త్రి వైపే జట్టు మేనేజ్ మొంట్ మొగ్గుచూపింది. అయితే మరో సారి రాబిన్ సింగ్ తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమౌతున్నాడు. ఇక లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ విజయానికి వస్తే  2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌ఇండియాకి రాజ్‌పుత్‌ జట్టు మేనేజర్‌గా వ్యవహరించారు. ఇదే ఆయనకు ప్లస్ పాయింట్ గా పరిగణించబోతోంది. అయితే ఇదొక్కటే కాకుండా...కోచ్ కు ఎంపికకు అనేక అంశాలు ముడిపడి ఉన్నాయంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఒక వేళ విదేశీ కోచ్ ను ఎంపిక చేయాలని జట్టు మేనేేజ్ మెంట్ భావిస్తే  టామ్‌మూడీ,  మైక్‌ హెస్సన్‌, ఫిల్‌ సిమ్మన్స్‌ బరిలో ఉన్నారు.  గతంలో టామ్ మూడీ శ్రీలంక జట్టుకు కోచ్‌గా వ్యవహరించగా, మైక్‌ హెస్సన్‌ న్యూజిలాండ్‌ జట్టుకి  పనిచేశాడు. ఫిల్‌ సిమ్మన్స్‌ వెస్టిండీస్‌, అఫ్గానిస్థాన్‌ జట్లకు కోచ్‌ బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది. మరి ఈ ఆరుగురిలో ఎవరిని కోచ్ గా ఎన్నుకుంటారనే దానిపై ఉత్కంఠత నెలకొంది.