క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో పంచ్‌లతో అందరికీ వినోదపరుస్తున్నాడు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అతడి ట్వీట్ల కోసం ఎంతో మంది అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తారు. తాజాగా క్రిస్‌గేల్‌ సెంచరీ చేసిన సందర్భంలో సెహ్వాగ్ చేసిన ఓ ట్వీట్‌ ఆశ్చర్యం కలిగించడంతో పాటు అందరికీ షాకిచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఛండీగడ్  వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆటగాడు క్రిస్‌గేల్‌ విశ్వరూపం చూపాడు. 58 బంతుల్లోనే సెంచరీతో పాటు మొత్తం 11 సిక్సులు, ఒక గఫోర్ తో 104 పరుగులు చేశాడు. ఈ సీజన్‌ ఐపీఎల్ లో గేల్ దే తొలి సెంచరీ కావడం విశేషం. గతేడాది ఐపీఎల్‌లో పేలవంగా ఆడటంతో.. ఈ సారి వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఒక్క ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. రెండుసార్లు అలాగే జరిగింది. చివరికి మూడో దఫాలో ప్రీతిజింతా అతడిని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకంతో రాణించిన గేల్ రెండో మ్యాచ్‌లో ఏకంగా సెంచరీ కొట్టేశాడు.  ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ ప్రతీకాత్మకంగా ఒక ట్వీట్‌ చేశాడు.



సెహ్వాగ్‌ ట్వీట్‌ మొదటి చిత్రంలో గతేడాది గేల్‌ డకౌట్‌ అయిన్నట్టు ఉంది. ఇక రెండో చిత్రంలో తాజా సెంచరీ సాధించిన విషయం ఉంది. ఈ రెండు ఫొటోలను పక్కపక్కన పెట్టి ‘అప్పుడు మీరు నన్ను ప్రేమించకపోతే... ఇప్పుడు నన్ను పొందే ....’ అన్నట్టు ఆంగ్లంలో రాశాడు. అంటే ‘నా వైఫల్యాన్ని మీరు ప్రేమించకపోతే ఇప్పుడు నా విజయాన్ని పొందేందుకు మీరు అర్హులు కారు’ అని అర్థం అన్నట్టు కాబోలు.



 


గురువారం జరిగిన మ్యాచ్ అనంతరం గేల్ మాట్లాడుతూ 'సెహ్వాగ్‌కు కృతజ్ఞతలు. న‌న్ను జట్టులోకి తీసుకోవ‌డం ద్వారా అత‌ను ఈ ఐపీఎల్‌ను కాపాడాడు' అని అన్నాడు. సెహ్వాగ్ తర్వాత నేను ఐపీఎల్‌ను కాపాడాను అంటూ ట్వీట్ చేశాడు. అవును అంటూ గేల్ రీ ట్వీట్ చేశాడు.