ఐపీఎల్ 11లో భాగంగా  చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ (68 పరుగులు; 30 బంతుల్లో 2×4, 6×6) దుమ్మురేపాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లోనే వేగవంతమైన సిక్స్ కొట్టి వార్తల్లో నిలిచాడు. ఆయన కొట్టిన సిక్స్ 111 మీటర్లు ఎగిరి పడింది. డివిలియర్స్ కొట్టిన బంతి స్టేడియం దాటి వెళ్లి పార్కింగ్ లాట్‌లో పడడం విశేషం.


ఇదే మ్యాచ్‌లో డివిలియర్స్ 23 బాల్స్‌లో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. డివిలియర్స్ చలవ వల్లే బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో డికాక్‌తో కలిసి రెండో వికెట్‌కి డివిలియర్స్ 133 పరుగుల జోడించడం గమనార్హం. ఇదే మ్యాచ్‌‌లో డికాక్ (53 పరుగులు: 37 బంతుల్లో 1x4, 4x6) కూడా అర్థ శతకం చేశాడు.