ఐపీఎల్‌-11లో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత రాజస్థాన్ బ్యాటింగ్‌కి దిగి.. 218 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. బెంగళూరు కేవలం 6 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ జట్టు తరఫున బరిలోకి దిగిన వారిలో విరాట్‌ కోహ్లీ (57; 30 బంతుల్లో 7×4, 2×6) తప్ప ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మన్‌దీప్‌ సింగ్‌ (47 నాటౌట్‌; 25 బంతుల్లో 6×4, 1×6), వాషింగ్టన్‌ సుందర్‌ (35; 19 బంతుల్లో 1×4, 3×6) మాత్రం కాస్త ఫరవాలేదనిపించారు. అయినా జట్టు గెలుపుతీరాలను చేర్చలేకపోయారు.


ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లలో సంజూ శాంసన్‌ (92 నాటౌట్‌; 45 బంతుల్లో 2×4, 10×6) మాత్రం రెచ్చిపోయి ఆడాడు. బౌలర్ల సహనాన్ని కూడా పరీక్షించాడు. కొడుతున్న ప్రతీ షాట్ కూడా బౌండరీకి పోతుండడంతో బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఓపెనర్‌ అజింక్య రహానె (36; 20 బంతుల్లో 6×4, 1×6)ఔట్ అయ్యాక వచ్చిన సంజూ తన విశ్వరూపాన్ని చూపించాడు.


తన టీమ్ భారీ స్కోరు చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. సంజూ శాంసన్ భారీ స్కోరు సాధించగానే ఆయనపై అభిమానులతో పాటు తోటి క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపించారు. భారత టీమ్‌కు అలాంటి ఆటగాళ్ల అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.