నాలుగు పరుగుల తేడాతో హైదరాబాద్‌పై చెన్నై విజయం
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై జట్టు నాలుగు పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై జట్టు నాలుగు పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది. తొలుత హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో చెన్నై జట్టు బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. ఆతరువాత 183 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు గాను ఆరు వికెట్లు కోల్పోయి 178 చేసింది. దీంతో నాలుగు పరుగుల తేడాతో హైదరాబాద్‌పై చెన్నై విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టులో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అంబటి రాయుడు (37 బంతుల్లో 79; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), సురేష్ రైనా (54 నాటౌట్; 43 బంతుల్లో 5×4, 2×6) అర్ధ సెంచరీలతో సత్తాచాటడంతో.. మూడో వికెట్‌కు 57 బంతుల్లోనే 112 పరుగులు చేసింది. చివర్లో ధోని 25 నాటౌట్ (12 బంతుల్లో 3 ఫోర్లు,1 సిక్సు)గా నిలవడంతో చెన్నై జట్టుకి భారీ స్కోరు లభించింది. చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 182 పరుగులు సాధించింది. దీపక్ చాహర్‌కు 3, ఠాకూర్, కరణ్ శర్మ, బ్రేవోలకు తలా ఒక వికెట్ లభించాయి.
ఆతరువాత బ్యాటింగ్ కు దిగిన .. సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ (84; 51 బంతుల్లో 5×4, 5×6), యూసుఫ్ పఠాన్ (45; 27 బంతుల్లో 1×4, 4×6) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆల్‌రౌండర్ రషీద్‌ఖాన్ చివరి ఓవర్‌లో ఒక సిక్సర్, ఫోర్ బాది మ్యాచ్‌పై ఆశలు రేకెత్తించాడు. రషీద్ మొత్తంగా 4 బంతులాడి రెండు సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో 17 పరుగులు చేశాడు.