కోహ్లీ కాళ్లు మొక్కి.. సెల్ఫీ తీసుకున్న వీరాభిమాని
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి రోజు రోజుకూ వీరాభిమానులు ఎక్కువవుతున్నారు.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి రోజు రోజుకూ వీరాభిమానులు ఎక్కువవుతున్నారు. శనివారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆడిన మ్యాచ్‌లో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓ అభిమాని అందరి కళ్లూ కప్పి ఎలాగోలా మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత సమయం చూసి పరుగెత్తుకొని వెళ్లి కోహ్లీ కాళ్ల మీద పడ్డాడు. ఆ తర్వాత సెల్ఫీ తీసుకున్నాడు.
అయితే అనుకోని ఈ హఠాత్పరిణామానికి సెక్యూరిటీ సిబ్బంది కంగుతిన్నారు. వెంటనే గ్రౌండులోకి వచ్చి ఆ అభిమానిని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లారు. అయితే కోహ్లీ అతన్ని విడిచిపెట్టమని.. కొట్టవద్దని సెక్యూరిటీకి చెప్పడంతో అతన్ని విడిచిపెట్టారు. గతంలో ధోనికి కూడా ఇలాంటి అనుభవాలే మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అనేకసార్లు ఎదురయ్యాయి.
ప్రస్తుతం ఆ ఫ్యాన్ విరాట్ కోహ్లీతో తీయించుకున్న సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. అయితే ఎప్పుడైతే కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫ్యాన్ మైదానంలోకి అడుగుపెట్టాడో మ్యాచ్‌కు కొంచెంపేపు అంతరాయం కలిగింది. టీవీల్లో ఆ సంఘటనను ఏ ఛానల్ కూడా ప్రసారం చేయలేదు. కాకపోతే అనేక మంది అభిమానులు ఆ సంఘటనను వీడియో తీసి వాట్సాప్‌లో, ఫేస్బుక్‌లో పంచుకున్నారు. విరాట్ కోహ్లీకి చెందిన ఫ్యాన్ పేజీల్లో కూడా వాటిని షేర్ చేశారు.