న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అభిమానులకు శుభవార్త. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి ఇంకా దారులు తెరిచే ఉన్నాయని సమాచారం. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్, విదేశీ ఆటగాళ్ల దూరం లాంటి సమస్యలున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఐపీఎల్ టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్యలోగానీ, లేక అక్టోబర్-నవంబర్ మధ్య కాలంలోనైనా ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహించాలన్న యోచనలో బీసీసీఐ ఉంది.  ‘అప్పుడే ఎంఎస్ ధోనీ రీఎంట్రీ.. ఇది క్లియర్’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి సమస్య కొన్ని నెలలల్లో తీరిపోతుందని, ఆలస్యంగానైనా సరే ట్వంటీ20 మెగా టోర్నీ ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందని బోర్డు అధికారి ఐఏఎన్ఎస్‌తో చెప్పారు. దీనికి ఓ ట్వంటీ20 వరల్డ్ కప్ రూపంలో పెద్ద చిక్కు ఉందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 తేదీల మధ్య జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వాయిదా వేస్తేనే ఆ సమయంలోనైనా ఐపీఎల్ నిర్వహించేందుకు ఛాన్స్ ఉందన్నారు అసాధ్యమనుకుంటే మాత్రం ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌పై ఏదైనా కఠిన నిర్ణయం తీసుకోక తప్పదన్నారు.కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్


ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ కరోనా మహమ్మారి ప్రబలుతోంది. పాజిటీవ్ కేసులతో పాటు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ఆస్ట్రేలియా, యూకేతో పాటు ఇతర అగ్ర దేశాలు కొన్ని నెలలపాటు వారి దేశాల్లో లాక్‌డౌన్‌లతో మరెన్నో ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ చీఫ్ కెవిన్ రాబర్ట్స్ దీనిపై ఇదివరకే స్పందించారు. టీ20 ప్రపంచ కప్ నిర్ణీత సమయానికే నిర్వహిస్తారని అభిప్రాయపడ్డారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photos 


బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone