ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ సీజన్ మధ్యలోనే నిలిచిపోవడంతో విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు అంత సులభంగా వెళ్లలేకపోయారు. ఆయా దేశాల ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు, కరోనా నిబంధనలతో కొన్ని దేశాల ఆటగాళ్లు గత రెండు వారాలకు పైగా స్వదేశానికి చేరుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొన్న ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు ఎట్టకేలకు తమ దేశానికి సుర‌క్షితంగా చేరుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ సీజన్ 14 మధ్యలోనే బీసీసీఐ ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను నిరవధిక వాయిదా వేసింది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లకు ఆ దేశ ప్రభుత్వాలు సైతం సహకరించడంతో వారు తమ దేశాలకు తిరిగి వెళ్లిపోయారు. అయితే భారత్‌లో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ నుంచి రాకపోకలపై రెండు వారాలపాటు నిషేధం విధించింది. దీంతో ఐపీఎల్ 2021 మధ్యలోనే నిలిచిపోయినా ఆసీస్ క్రికెటర్లు (Australian Cricketer) ఇళ్లకు వెళ్లడానికి ఆ దేశ ప్రభుత్వం ఆంక్షలు అడ్డంకిగా మారాయి. 


Also Read: IPL 2021: ఆస్ట్రేలియా క్రికెటర్లకు టీ20 లీగ్స్‌పై జాతీయ బోర్డు కీలక సూచనలు, ఆదేశాలు


ఐపీఎల్ 2021లో భాగస్వాములైన ఆస్ట్రేలియా క్రికెటర్లు, కోచ్‌లు, ఇతర సహాయక సిబ్బంది తొలుత మాల్దీవులకు వెళ్లారు. అక్కడ రెండు వారాలు గడిపిన అనంతరం మొత్తం 40 మంది ప్రత్యేక విమానంలో ప్రయాణించి సిడ్నీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ సైతం ఓ హోటల్‌లో రెండు వారాలపాటు క్వారంటైన్‌లో ఉండబోతున్నారు. IPL 2021 నిలిచిపోయాక మాల్దీవులు వెళ్లిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రికీ పాంటింగ్ తదితరులు నేడు సిడ్నీ చేరుకున్నారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ దోహా నుంచి ఆదివారం తన స్వస్థలానికి చేరుకున్నాడు. క్వారంటైన్ ముగిసిన తరువాత వారు ఇళ్లకు వెళతారని ఓ అధికారి వెల్లడించాడు.


Also Read: IPL 2021: Pat Cummins ఐపీఎల్ మధ్యలోనే విడిచి వెళ్తాడా, క్లారిటీ ఇచ్చిన ఆల్ రౌండర్


కాగా, ఐపీఎల్ 2021 తిరిగి కొనసాగించే అవకాశాలు మాత్రం కనపించడం లేదు. ఒకవేళ సీజన్ 14 మిగతా మ్యాచ్‌లు నిర్వహించినా తమ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. వారు టీ20 వరల్డ్ కప్, భారత్‌తో టెస్టు సిరీస్‌, న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు సన్నద్దమవుతున్నారు. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకుగానూ న్యూజిలాండ్ జట్టు యూకేకు చేరుకోనుంది. త్వరలో భారత క్రికెట్ జట్టు సైతం ఇంగ్లాండ్‌కు పయనం కానుంది. అక్కడే టీమిండియా క్రికెటర్లు కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకుంటారని బీసీసీఐకి చెందిన ఓ అధికారి ఇటీవల వెల్లడించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook