దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ సేవ్‌ వణికిస్తోంది. కోవిడ్19(COVID-19) నిబంధనలు పాటించడం, కరోనా టీకాలు తీసుకోవడం మమమ్మారి జయించే అస్త్రాలుగా వైద్యశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కరోనా విషయంలో భారీ ఊరట లభించింది. ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఈ వార్త సీఎస్కే శిబిరంలో సంతోషాన్ని నింపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తల్లి దేవికా రాణి, తండ్రి పాన్ సింగ్‌లకు పది రోజుల కిందట కరోనా సోకింది. లక్షణాలు కనిపించడంతో కోవిడ్19 నిర్ధారణ టెస్టులు చేయించుకోగా వారికి పాజిటివ్‌గా తేలింది. కరోనా ఫలితాలు వచ్చిన అనంతరం రాంచీలోని పల్స్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ధోనీ(MS Dhoni) తల్లిదండ్రులు దేవికా రాణి, పాన్ సింగ్‌ కరోనాకు చికిత్స తీసుకున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవడం, ఆ వెంటనే చికిత్స తీసుకోవడంతో వారు పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నారు. కోవిడ్ బారి నుంచి కోలుకున్న ధోనీ తల్లిదండ్రులు దేవికా రాణి, పాన్ సింగ్ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. 


Also Read: IPL 2021: Pat Cummins ఐపీఎల్ మధ్యలోనే విడిచి వెళ్తాడా, క్లారిటీ ఇచ్చిన ఆల్ రౌండర్



ఏప్రిల్ 20 నుంచి ధోనీ పేరెంట్స్‌కు చికిత్స అందిస్తుండగా, తాజా ఫలితాలలో వారికి కరోనా నెగెటివ్‌గా తేలడంతో డిశ్ఛార్జ్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు  ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2021 మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథిగా వ్యవహరిస్తున్న ధోనీ తన తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు హెల్తె బులెటిన్ తెలుసుకుంటున్నట్లు సమాచారం. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో సీఎస్కేను విజయపథంలో నడిపించాడు. ధోనీ ఇంట్లో కరోనా కేసుల నేపథ్యంలో సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, సహాయక సిబ్బంది అతడికి అండగా నిలిచారు. ధోనీని ఒత్తిడి నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేశారు. 


Also Read: CSK vs SRH match highlights: రెచ్చిపోయిన గైక్వాడ్, డుప్లెసిస్.. సన్‌రైజర్స్‌పై చెన్నై విజయం


గత ఏడాది ఐపీఎల్‌లో తొలిసారిగా సీఎస్కే జట్టు ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. దీంతో ఐపీఎల్ 2021 టైటిల్ లక్ష్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ బరిలోకి దిగింది. కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూల్‌గా వ్యవహరిస్తూ తొలి మ్యాచ్ మినహా, వరుసగా 5 మ్యాచ్‌లలో సీఎస్కేకు విజయాలు అందించాడు. తల్లిదండ్రులకు కరోనా నుంచి కోలుకున్న తరువాత ధోనీ తన వ్యూహాలకు మరింత పదునుపెట్టి చెన్నై జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చనున్నాడని ఫ్రాంచైజీ ధీమా వ్యక్తం చేస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook