IPL 2021 Josh Hazlewood : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజెల్‌వుడ్ ఐపీఎల్ 14వ సీజన్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని చెన్నై ఫ్రాంఛైజీకి పేసర్ హజెల్‌వుడ్ తెలిపాడు. అతడి నిర్ణయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీ గౌరవించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఏడాది కాలం నుంచి ఎదుర్కొంటున్న పరిస్థితుల కారణంగానే ఐపీఎల్ 2021లో తాను ఆడటం లేదని సీఎస్కే పేసర్ జోష్ హజెల్‌వుడ్ తెలిపాడు. కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో మ్యాచ్‌లు ఆడుతూ తాను అలసిపోయానని, కొంతకాలం రిఫ్రెష్ అయ్యేందుకు ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నట్లు 30 ఏళ్ల Chennai Super Kings క్రికెటర్ వెల్లడించాడు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కాస్త సమయం గడపాలని భావిస్తున్నానని, బయో బబుల్ వాతావరణం నుంచి విశ్రాంతి కోరుకుంటున్నట్లు చెప్పాడు.


Also Read: IPL 2021: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆడబోతున్నాను, నా కల నెరవేరనుంది: యువ క్రికెటర్


గత 10 నెలల సమయం నుంచి అధిక సమయం క్వారంటైన్, బయో బబుల్ వాతావరణంలో ఉన్నానని కొంతకాలం క్రికెట్(IPL 2021) నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు. క్రికెట్.కామ్.ఏయూతో బుధవారం మాట్లాడుతూ జోష్ హజెల్‌వుడ్ ఈ విషయాలు షేర్ చేసుకున్నాడు. త్వరలో శీతాకాలం వస్తుందని, వెస్టిండీస్ లాంటి సుదీర్ఘ పర్యటన, బంగ్లాదేశ్‌తో టీ20 పర్యటన.. ఆ తరువాత టీ20 వరల్డ్ కప్‌నరకు సిద్ధంగా ఉండాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఈ 12 నెలల సమయం తనకు చాలా కీలకమని, మానసికంగా, శారీరకంగా కొంతకాలం విరామం తీసుకుని పూర్తి స్థాయిలో ఆస్ట్రేలియా జట్టు సభ్యుడిగా క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు.


Also Read: IPL 2021: గాయం నుంచి కోలుకుని ఐపీఎల్‌కు సిద్ధమైన స్టార్ పేసర్ మహమ్మద్ షమీ


ఆస్ట్రేలియాకు చెందిన పలువురు క్రికెటర్లు సైతం జోష్ హజెల్‌వుడ్ తరహాలోనే ఆలోచిస్తున్నారు. గత 10 నెలల సమయం నుంచి బయో బబుల్ వాతావరణంలో అలసిపోయామని భావిస్తున్నారు. జోష్ ఫిలిప్, మిచెల్ మార్ష్ సైతం ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు వారి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సమాచారం అందించారు. తాజాగా జోష్ హజెల్‌వుడ్ ఈ ఐపీఎల్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. మోయిన్ అలీ, సామ్ కరన్, లుంగి ఎంగిడి, డ్వేన్ బ్రావో లాంటి ఆటగాళ్లు బౌలింగ్ విభాగంలో సీఎస్కే జట్టులో స్థానం కోసం పోటీ పడాల్సి వస్తుంది.  


Also Read: Gold Price Today 01 April 2021: గుడ్ న్యూస్, మళ్లీ పతనమైన బంగారం ధరలు, వెండి ధరలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook