ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తొలిసారిగా షెడ్యూల్ చేసిన మ్యాచ్ వాయిదా పడింది. ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న జరగాల్సిన మ్యాచ్ వాయిదా వేశారు. ప్రస్తుతం నేటి మ్యాచ్‌పై సైతం నీలినీడలు కమ్ముకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ కరోనా కలకలం రేపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ ఆరోగ్యంపై ఫ్రాంచైజీ సీఈవో వెంకీ మైసూర్ స్పందించారు. సందీప్ వారియర్ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందన్నారు. అయితే వరుణ్ చక్రవర్తిలో కరోనా లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. గత నాలుగు రోజుల్లో నిర్వహించిన మూడో రౌండ్ కరోనా టెస్టుల ఫలితాలలో పాజిటివ్ వచ్చింది. ఇతర ఆటగాళ్లకు నెగెటివ్‌గా తేలిందన్నారు. సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరలో కరోనా బారి నుంచి కోలుకుంటారని చెప్పారు.


Also Read: IPL 2021: ఇద్దరు ఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్, RCB vs KKR మ్యాచ్ రీషెడ్యూల్


ఇతర IPL 2021 ఆటగాళ్లకు కరోనా సోకకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్టార్ స్పోర్ట్స్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు షేర్ చేసుకున్నారు. సందీప్ వారియర్ విషయానికొస్తే అతడిలో ఏ లక్షణాలు కనిపంచడం లేదని తెలిపారు. వరుణ్ చక్రవర్తిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, వీరిద్దరూ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో మెడికల్ సిబ్బంది, కేకేఆర్ సహాయక సిబ్బంది, హోటల్ స్టాఫ్, ఇలా ప్రతి విభాగాలలో అందర్నీ హోం క్వారంటైన్ కావాలని సూచించినట్లు వివరించారు.


Also Read: Cricket Australia Donation: భారత్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఆపన్నహస్తం, 50వేల డాలర్లు కరోనా విరాళం


రాత్రి పడుకునే ముందు ఆటగాళ్ల నుంచి శాంపిల్స్ తీసి కరోనా టెస్టులు చేస్తామని, తెల్లారేసరికి వారి కోవిడ్19 టెస్టుల ఫలితాలు వస్తాయన్నారు. దాంతో ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సమయం ఉంటుందని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ అభిప్రాయపడ్డారు. క్రమం తప్పకుండా కరోనా టెస్టులు చేస్తున్నప్పటికీ, మే 6న తేలనున్న కరోనా టెస్టుల ఫలితాలపై ప్రాక్టీస్ సెషన్, తదుపరి మ్యాచ్‌లో ఎవరు ఆడతారనే దానిపై స్పష్టత వస్తుందన్నారు. కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మే 8న తలపడనుంది. అహ్మదాబాద్ ఇందుకు వేదికగా మారనుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook