IPL 2021 చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్స్ MS Dhoni ప్రాక్టీస్ షురూ, టైటిల్ లక్ష్యంగా సీఎస్కే
IPL 2021 CSK Captain MS Dhoni : గత ఏడాది తీవ్రంగా నిరాశ పరిచి న మహేంద్ర సింగ్ సారథ్యంలోని సీఎస్కే జట్టు ఈ ఏడాది అంచనాలు అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్లాన్ ప్రకారం ఇతర జట్ల కన్నా ముందుగానే చెన్నై జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
IPL 2021 MS Dhoni : ఈ ఏడాది కచ్చితంగా ఐపీఎల్ 2021 టైటిల్ నెగ్గాలని మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఉవ్విళ్లూరుతోంది. గత ఏడాది తీవ్రంగా నిరాశ పరిచి న మహేంద్ర సింగ్ సారథ్యంలోని సీఎస్కే జట్టు ఈ ఏడాది అంచనాలు అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్లాన్ ప్రకారం ఇతర జట్ల కన్నా ముందుగానే చెన్నై జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సహా పలువురు ఆటగాళ్లు ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు పాసయ్యారని తెలుస్తోంది. సరిగ్గా నెలరోజుల్లో ఐపీఎల్ 2021(IPL 2021) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ధోనీ, సీనియర్ ఆటగాడు అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, మరికొందరు ఆటగాళ్లు సీఎస్కే శిక్షణ శిబిరానికి చేరుకున్నారు. తమిళనాడుకు చెందని ఎన్ జగదీషన్, ఆర్ సాయి కిషోర్, సి హరి నిషాంత్ లాంటి యువ ఆటగాళ్లకు ధోనీ, రాయుడుల లాంటి సీనియర్ ఆటగాళ్లు సలహాలు ఇచ్చారు. మీడియం పేసర్ హరిశంకర్ రెడ్డి సైతం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
కోవిడ్-19(COVID-19) నిబంధనలు, క్వారంటైన్‌కు సంబంధించిన ప్రక్రియను చెన్నై ఆటగాళ్లు పూర్తి చేశారని, దాంతో మంగళవారం నుంచి సీఎస్కే(Chennai Super Kings) ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారని విశ్వనాథన్ తెలిపారు. ఫ్రాంచైజీకి చెందిన ఇతర ఆటగాళ్లు త్వరలోనే జట్టుతో చేరనున్నారని చెప్పారు. లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ, ఇటీవల వేలంలో తీసుకున్న భగత్ వర్మ కొన్ని రోజుల్లో శిక్షణా శిబిరానికి చేరుకుంటారని తెలిపారు.
Also Read: IPL 2021 Schedule: ఐపీఎల్ 2021 పూర్తి షెడ్యూల్, వేదికల వివరాలు విడుదల చేసిన BCCI
కెప్టెన్ ధోనీ వారం రోజుల కిందట చెన్నై చేరుకున్నాడు. ఐపీఎల్ తాజా సీజన్‌లో సొంత వేదికలపై ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్స్ జట్లకు లేకపోవడంతో ధోనీ తన వ్యూహాలకు పదును పెడుతున్నాడు. కాగా, ఇటీవల వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మోయిన్ అలీని రూ.7కోట్లు, కర్ణాటక ఆల్ రౌండర్ క్రిష్ణప్ప గౌతమ్‌ను రూ.9.25 కోట్ల భారీ ధరకు సీఎస్కే సొంతం చేసుకుంది.
ఏప్రిల్ 9వ తేదీన చెన్నై వేదికగానే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మూడుసార్లు ఛాంపియన్ అయిన సీఎస్కే జట్టు ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై వేదికగా తలపడననుంది. ఆ మ్యాచ్ ద్వారా తమ ఐపీఎల్ 14 సీజన్‌ను ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు ప్రారంభించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook