IPL 2021 Mumbai Indians Schedule: ఐపీఎల్ 2021 ముంబై ఇండియన్స్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్స్ పూర్తి వివరాలు
Mumbai Indians IPL 2021 Full Schedule: లీగ్‌లో అత్యధిక ట్రోఫీలు అందుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) నిలిచింది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నైలో ఏప్రిల్ 9న రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది.
Mumbai Indians IPL 2021 Full Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 షెడ్యూల్ వచ్చేసింది. లీగ్‌లో అత్యధిక ట్రోఫీలు అందుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) నిలిచింది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నైలో ఏప్రిల్ 9న రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది. లీగ్ దశలో మై 23న చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తలపడుతుంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఈ ఐపీఎల్‌లో జట్లకు సొంత వేదిక అడ్వాంటేజ్ ఉండదని స్పష్టం చేసింది. కేవలం ఆరు నగరాలు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై మరియు కోల్‌కతా నగరాలలోనే ఐపీఎల్ 2021 సీజన్ జరగనుంది. కనుక డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) సైతం ఐపీఎల్ 14లో సొంత మైదానం వాంఖెడేలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఉండదని తెలుస్తోంది.
Also Read: IPL 2021 Schedule: ఐపీఎల్ 2021 టీ 20 టోర్నీ షెడ్యూల్ ఖరారు, ఎప్పటి నుంచో తెలుసా
ఈ సీజన్ కోసం జరిగిన ఐపీఎల్ 2021(IPL 2021) మిని వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ కోల్టర్ నైల్ (రూ. 5 కోట్లు), పీయూష్ చావ్లా(రూ. 2.4 కోట్లు), ఆడం మిల్నే (రూ. 3.2 కోట్లు), జేమ్స్ నీషమ్ (రూ. 50 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ. 20 లక్షలు), మార్కో జాన్సెన్ (రూ. 20 లక్షలు), యుధ్‌విర్ సింగ్(రూ. 20 లక్షలు) లాంటి ఆటగాళ్లను 5సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. దాంతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తుంది.
Also Read: MS Dhoni: మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డుకు ఎసరు పెట్టిన Virat Kohli, అడుగు దూరంలో
మ్యాచ్ 1: ఏప్రిల్ 9, శుక్రవారం – ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రాత్రి 7:30 -చెన్నై
మ్యాచ్ 2: ఏప్రిల్ 13, మంగళవారం – కోల్‌కతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్ - రాత్రి 7:30 - చెన్నై
మ్యాచ్ 3: ఏప్రిల్ 17, శనివారం – ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాత్రి 7:30 - చెన్నై
మ్యాచ్ 4: ఏప్రిల్ 20, మంగళవారం – ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ - రాత్రి 7:30 - చెన్నై
మ్యాచ్ 5: ఏప్రిల్ 23, శుక్రవారం – పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ - రాత్రి 7:30 - చెన్నై
మ్యాచ్ 6: ఏప్రిల్ 29, గురువారం – ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ - సాయంత్రం 3:30 - ఢిల్లీ
మ్యాచ్ 7: మే 1, శనివారం – ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - రాత్రి 7:30 - ఢిల్లీ
Also Read: IPL 2021 Auction Latest Updates: ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే
మ్యాచ్ 8: మే 4, మంగళవారం – సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ - రాత్రి 7:30 - ఢిల్లీ
మ్యాచ్ 9: మే 8, శనివారం – రాజస్థాన్ రాయల్స్ v ముంబై ఇండియన్స్ - రాత్రి 7:30 - ఢిల్లీ
మ్యాచ్ 10: మే 10, సోమవారం – ముంబై ఇండియన్స్ v కోల్‌కతా నైట్ రైడర్స్ - రాత్రి 7:30 - బెంగళూరు
మ్యాచ్ 11: మే 13, గురువారం – ముంబై ఇండియన్స్ v పంజాబ్ కింగ్స్ - సాయంత్రం 3:30 - బెంగళూరు
మ్యాచ్ 12: మే 16, ఆదివారం – చెన్నై సూపర్ కింగ్స్ v ముంబై ఇండియన్స్ - రాత్రి 7:30 - బెంగళూరు
మ్యాచ్ 13: మే 20, గురువారం – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు v ముంబై ఇండియన్స్ - సాయంత్రం 3:30 - కోల్‌కతా
మ్యాచ్ 14: మే 23, ఆదివారం – ముంబై ఇండియన్స్ v ఢిల్లీ క్యాపిటల్స్ - సాయంత్రం 3:30 - కోల్‌కతా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook