COVID-19 విషాదం, కరోనాతో టీమిండియా క్రికెటర్ Piyush Chawla తండ్రి కన్నుమూత
టీమిండియా క్రికెటర్ల ఇళ్లల్లో కరోనా మహమ్మారి విషాదాన్ని నింపుతోంది. ఇటీవల మహిళా క్రికెటర్ వేద క్రిష్ణమూర్తి తల్లి, సోదరి మరణం, మరియు నిన్న రాజస్తాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా తండ్రి మరణవార్తను మరిచిపోయేలోపే మరో విషాదం చోటుచేసుకుంది. టీమిండియా క్రికెటర్ పియూష్ చావ్లా ఇంట్లో కరోనా మహమ్మారి పెను విషాదాన్ని మిగిల్చింది.
ముంబై ఇండియన్స్ స్పిన్నర్ పియూష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా కరోనా మహమ్మారి బారిన పడి కన్నుమూశారు. కొంతకాలం కిందట చావ్లా తండ్రికి కరోనా సోకింది. అయితే కోవిడ్19 మహమ్మారిని ఆయన జయించినా ఆ వైరస్ రక్కసి ప్రమోద్ కుమార్ ఆరోగ్యాన్ని క్షీణించేలా చేసింది. కరోనా నుంచి కోలుకున్నా ఆ మహమ్మారి లక్షణాలతో సతమతమవుతున్న ఆయన సోమవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన లేకుంటే నా జీవితం ఒకే తీరుగా ఎన్నటికీ ఉండదంటూ బాధతో పియూష్ చావ్లా ఈ విషాదవార్తను అభిమానులకు తెలిపాడు.
Also Read: Rajasthan Royals పేసర్ Chetan Sakariya ఇంట్లో విషాదం నింపిన కరోనా
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో పియూష్ చావ్లా ఒకడు. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో 156 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు ప్రాతినిథ్యం వహించిన చావ్లాను ఫ్రాంచైజీ వదులుకోవడంతో ఐపీఎల్ 2021 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తీసుకుంది. అంతకు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పలు సీజన్లలో కీలక బౌలర్‌గా పియూష్ చావ్లా సేవలు అందించాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
Also Read: IPL 2021 Suspended: ఆటగాళ్లకు కరోనా, ఐపీఎల్ నిరవధిక వాయిదా వేసిన BCCI
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook