Virat Kohli Crying Video:ఏడ్చేసిన కోహ్లీ & డివిలియర్స్..ఇంటర్నెట్ లో వైరలైన వీడియో
సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది. కోహ్లీ కెప్టెన్సీగా చివరి మ్యాచ్ కాగా.. అనంతరం కోహ్లీ, డివిలియర్స్ ఏడ్చేసిన వీడియో నెట్ లో వైరలైంది.
Virat Kohli Crying Video: ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశలో భాగంగా సోమవారం జరిగిన ఎలిమినేటర్ (Eliminator Match IPL 2021) మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bangalore) ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) లో ఆర్సీబీ (RCB) ఓటమి పాలై టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన సంగతి మనకు తెలిసిందే.
ఇందులో భాగంగా కోహ్లీకి (Kohli) ఈ సీజన్ కెప్టెన్ గా చివరి మ్యాచ్ కాగా.. ఎలాగైన కప్ గెలచి.. ఘనంగా కెప్టెన్సీ నుండి వైదొలగాలని భావించాడు. కాకపోతే అనుకోకుండా ఓటమి చెంది టోర్నీ లోనుంచి నిష్క్రమించటంతో నిరాశగానే కోహ్లీ కెప్టెన్సీకి (Captain Kohli) గుడ్ బై చెప్పాడు.
Also Read: viral Wedding Dance: అదిరిపోయిన బావ-మరదలు డ్యాన్స్.. నెటిజన్లతో ఈల వేయిస్తున్న వీడియో
మ్యాచ్ అయిపోయిన తరువాత విరాట్ కోహ్లీ (Virat Kohli) మొదటి సారి కన్నీరు పెట్టుకున్నారు. విరాట్ ను చూసి డివిలియర్స్ (De Villiers) కూడా ఏడ్చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వగా.. వీడియో చూసిన అభిమానులు బాధకు గురి అవుతున్నారు.
విరాట్ కోహ్లీ తన ఆధికారిక ట్విట్టర్ ఖాతాలో "ఇన్ని రోజులు తనకు సహకరించిన సహాయక సిబ్బందికి, సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ కు మరియు ఆర్సీబీ (RCB) యాజమాన్యానికి ధన్యవాదాలు అంటూ" ఉద్వేగభరిత ట్వీట్ చేసాడు.
2013 నుండి ఐపీఎల్ (IPL) లో ఆర్సీబీ తరపున ఆడుతున్న వరకు కోహ్లీ 140 మ్యాచ్‌లకు కెప్టెన్ గా ఉన్న 66 మ్యాచ్ లలో విజయం సాధించగా, 70 మ్యాచ్ లలో ఆర్సీబీ ఓడిపోయింది మరియు 44 మ్యాచ్ లలో ఫలితాలు తేలలేదు.
Also Read: Banerjee comments : మోహన్‌బాబు కొట్టడానికి వచ్చారంటూ కంటతడి పెట్టుకున్న బెనర్జీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook