IPL 2021 RR vs PBKS Highlights: నిషేధం ఎదుర్కొన్న బాధ Deepak Hooda బ్యాటింగ్‌లో కనిపించింది
IPL 2021 RR vs PBKS Highlights: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ సాధించాడు. టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సైతం సమం చేశాడంటే దీపక్ హుడా ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
IPL 2021 RR vs PBKS Highlights: బరోడా బాంబర్ దీపక్ హుడా అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడి తాను ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి ఏం నేర్చుకున్నాడో మనకు చూపించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ సాధించాడు. టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సైతం సమం చేశాడంటే దీపక్ హుడా ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని ఆటగాళ్లలో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా దీపక్ హుడా నిలిచాడు.
ఓవరాల్‌గా 28 బంతుల్లో 64 పరుగులు సాధించి పంజాబ్ కింగ్స్ జట్టు భారీ స్కోరు చేయడంలో దీపక్ హుడా తనవంతు పాత్ర పోషించాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్, ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా కేవలం 20 బంతుల్లో రాజస్థాన్ రాయల్స్‌పై హాఫ్ సెంచరీలు సాధించారు. తాజాగా ఆ రికార్డును దీపక్ హుడా సమం చేశాడు. డేవిడ్ మిల్లర్ 2014లో చేసిన 19 బంతుల్లో అర్థ శతకం ఇప్పటివరకూ రాజస్థాన్‌పై ప్రత్యర్థి ఆటగాడు చేసిన వేగవంతమైన హాఫ్ సెంచరీగా ఉంది. ఐపీఎల్ 2021(IPL 2021)కు ముందు తాను ఎదుర్కొన్న అవమానాలు, క్లిష్ట పరిస్థితుల నుంచి తానేం నేర్చుకున్నాడో తాజా సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే చూపించాడు.
Also Read: RR vs PBKS, IPL 2021: రాజస్థాన్‌పై పంజాబ్ కింగ్స్ విజయం.. Sanju Samson సెంచరీ వృథా
ఐపీఎల్‌లో కేవలం 23 బంతుల్లోపే రెండు పర్యాయాలు హాఫ్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు దీపక్ హుడా కావడం గమనార్హం. ఏప్రిల్ 12వ తేదీనే ఈ ఫీట్ రెండు సార్లు నమోదు చేయడం విశేషం. 2015లో రాజస్థాన్ రాయల్స్‌పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, తాజాగా 20 బంతుల్లో మరోసారి అదే జట్టుపై విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదని, ముందుకు సాగాలనుకుంటే దీపక్ హుడా కొన్ని నెలల నుంచి ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. హుడాను అభినందించాడు.
Also Read: SRH vs KKR Match Highlights: ఐపీఎల్ చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
దీపక్ హుడాపై నిషేధం
బరోడా జట్టుకు ఆడే దీపక్ హుడాపై కొన్ని నెలల కిందట నిషేధం విధించారు. జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యాతో విభేదాల కారణంగా బరోడా క్రికెట్ అసోసియేషన్ ఈ సీజన్ మ్యాచ్‌లు ఆడకుండా దీపక్ హుడాను నిషేధించారు. ఆ కారణంగా అతడు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్, విజయ్ హజారే వన్డేయర్స్ టోర్నీలలో పాల్గొనలేకపోయాడు. అయితే ఐపీఎల్ 2021లో తొలి మ్యాచ్‌లోనే తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చి, నికోలస్ పూరన్ కన్నా ముందుగా క్రీజులోకి పంపడంతో తన సత్తా ఏంటో చూపించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook