IPL 2021 To Resume on September 19: క్రికెట్ ప్రేమికులు, ఐపీఎల్ ఫ్యాన్స్‌కు శుభవార్త వచ్చేసింది. కరోనా కేసుల కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) ఎప్పుడు మొదలుకానుందో స్పష్టత వచ్చేసింది. ఐపీఎల్ సీజన్ 14 మిగతా మ్యాచ్‌లు సెప్టెంబర్ 19నుంచి ప్రారంభం కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారి ఏఎన్ఐ మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్ 2021 (IPL 2021) నిర్వహణపై కొన్ని అప్‌డేట్స్ అందించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) వేదికగా సెప్టెంబర్ 19న ఐపీఎల్ 14 మిగతా మ్యాచ్‌‌లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. అక్టోబర్ 15న ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. భారత్‌లో దసరా పండుగ రోజునే యూఏఈలో లీగ్ ఫైనల్ ఖరారు చేయడం గమనార్హం.


Also Read: IPL 2021 Suspension: టీ20 లీగ్స్‌పై CSK ఆటగాడు Faf du Plessis కీలక వ్యాఖ్యలు 


కాగా, ఐపీఎల్ 2021 సీజన్ సైతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా యూఏఈ వేదికగా నిర్వహించారు. ఆ సమయంలో ఒక్క కరోనా కేసు సమస్యా లేకుండా ఐపీఎల్ 13 సజావుగా జరిగింది. కానీ ఈ ఏడాది కరోనా కేసులు పెరుగుతున్నా భారత్‌లో ఐపీఎల్ 14 నిర్వహించడంతో ఆటగాళ్లు, కోచ్, సిబ్బందికి కరోనా సోకడంతో బీసీసీఐ ప్రస్తుత సీజన్‌ను నిరవధికంగా వాయిదా (IPL 2021 Suspension) వేసింది. యూఏఈలోని అబుదాబీ, దుబాయ్ వేదికలుగా మిగతా సీజన్ మ్యాచ్‌ల నిర్వహణకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ చర్చలు సఫలం కావడంతో షెడ్యూల్ విడుదల చేసింది.


Also Read: IPL 2021: నిద్రలేని రాత్రులు గడిపిన R Ashwin, అందుకే ఐపీఎల్ 2021 మధ్యలోనే వైదొలిగాడు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook