IPL 2022 Auction: కెప్టెన్‌గా హార్దిక్.. అహ్మదాబాద్ ఎంచుకున్న ప్లేయర్స్ వీరే! లక్నో సారథి, కోచింగ్ లిస్ట్ ఇదే!!
IPL 2022 Auction: అహ్మదాబాద్ ప్రాంచైజీ తన జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకుంది. లక్నో ప్రాంచైజీకి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Ahmedabad Names Hardik Pandya As Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 మెగా వేలంకు సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో వేలం జరుగుతుందని ఇప్పటికే బీసీసీఐ (BCCI) వర్గాలు ప్రకటించాయి. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు వేలం ఆరంభం కానుంది. ఇక మెగా వేలంకు (IPL 2022 Auction) 20 రోజులు మాత్రమే ఉండడంతో కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్ మరియు లక్నోలు ఆటగాళ్ల ఎంపికను పూర్తిచేశాయి. ప్లేయర్స్ ఎంపికకు ఈరోజు (జనవరి 22) చివరి గడువు కాబట్టి రెండు ఫ్రాంచైజీలు తాము ఎంచుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి.
అహ్మదాబాద్ ప్రాంచైజీ (Ahmedabad ) తన జట్టుకు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya Captain)ను కెప్టెన్‌గా ఎంచుకుంది. పాండ్యాను 15 కోట్లకు అహ్మదాబాద్ కైవసం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) కోసం కూడా రూ.15 కోట్లు వెచ్చించింది. ఇక భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill)ను అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రూ.7 కోట్లకు సొంతం చేసుకుంది. గతంలో పాండ్యా ముంబై ఇండియన్స్, రషీద్ సన్‌రైజర్స్ హైదరాబాద్, గిల్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడారు. అహ్మదాబాద్ ప్రాంచైజీకి టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా (Ashish Nehra) కోచ్ కాగా.. టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ మెంటర్‌గా ఎంపికయ్యాడు.
Also Read: Andre Russell Run Out: క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రనౌట్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే (వీడియో)!!
లక్నో (Lucknow) ప్రాంచైజీకి టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కెప్టెన్ (KL Rahul Captain)గా ఎంపికయ్యాడు. రాహుల్ కోసం లక్నో ప్రాంచైజీ రూ. 17 కోట్లు ఖర్చు చేసింది. భారత దేశవాళీ ప్లేయర్ రవి బిష్ణోయ్ (Ravi Bishnoi), ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ (Marcus Stoinis)ను లక్నో జట్టులోకి తీసుకుంది. స్టాయినిస్‌ను రూ.9.2 కోట్లకు, బిష్ణోయ్‌ను రూ.4 కోట్లకు దక్కించుకుంది. లక్నో ప్రాంచైజీకి ఆండీ ఫ్లవర్ హెడ్ కోచ్ కాగా.. విజయ్ దహియా సహాయ కోచ్. ఇక గౌతమ్ గంభీర్ మెంటర్‌గా వ్యవహరించనున్నాడు.
ఐపీఎల్ 2022 టైటిల్ స్పాన్సర్‌గా టాటా గ్రూప్ ఉండబోతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ఇటీవలే స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా టైటిల్ స్పాన్సర్‌గా ఉంటున్న వివో (VIVO) స్థానంలో టాటా గ్రూప్ ఎంపికైంది. ఇక భారత దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 2022 వేదికపై సందిగ్ధత నెలకొంది. దక్షిణాఫ్రికా లేదా యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఈ విషయంపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.
Also Raed: Priyanka Chopra - Nick Jonas: షాకింగ్ న్యూస్.. తల్లైన స్టార్ హీరోయిన్! అంతా సీక్రెట్‌గానే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook