McCullum says Disappoints KKR to lose Opener Shubman Gill: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2022లో శుభ్‌మన్‌ గిల్‌ లాంటి ప్రతిభావంతుడి సేవలు కోల్పోవడం చాలా బాధగా ఉందని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) హెడ్ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ అన్నారు. నిబంధనల కారణంగా కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీలలో వేలం జరగనుంది. మెగా వేలం నేపథ్యంలో 1214 మంది ఆట‌గాళ్లు త‌మ పేర్లును న‌మోదు చేసుకున్నారు. స్టార్ ఆటగాళ్లు ఈ లిస్టులో ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్‌ 2022లో పది జట్లతో మెగా టోర్నీ జరగనుంది. టోర్నీలోకి ఈసారి రెండు కొత్త జట్లు రావడంతో ఫ్రాంఛైజీలన్నీ తమ ఆటగాళ్లను (నలుగురు మినహా) వదులు కోవాల్సివచ్చింది. ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చాలా మంది స్టార్ ఆటగాళ్లను వదులుకుంది. అందులో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ కూడా ఉన్నాడు. కొన్నాళ్లుగా కేకేఆర్ జట్టుకు గిల్‌ మంచి ఆరంభాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌, వెంకటేశ్ అయ్యర్‌, వరుణ్‌ చక్రవర్తిలను కేకేఆర్ అట్టిపెట్టుకుంది. 


తాజాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విడుదల చేసిన వీడియోలో కేకేఆర్ హెడ్ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ మాట్లాడుతూ.... 'ఐపీఎల్ 2022 సీజన్‌ కోసం చాలా మంది ఆటగాళ్లను కోల్పోవాల్సి వచ్చింది. అందుకు తగిన ఆటగాళ్లను తీసుకోవాలంటే.. సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. శుభ్‌మన్‌ గిల్‌ కొన్నాళ్లుగా మంచి ప్రదర్శన చేశాడు. అతడిని కోల్పోవడం బాధగా ఉంది. కానీ కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు' అని అన్నారు. గిల్‌ను అహ్మదాబాద్ ప్రాంచైజీ రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. 


'మెగా వేలంలో మంచి జట్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అందుకు తగ్గట్టే ప్రణాళికలు రచిచూస్తున్నాం. సునీల్ నరైన్‌, ఆండ్రీ రసెల్‌ లాంటి ఆటగాళ్లు మా జట్టుకు చాలా కాలంగా సేవలందిస్తున్నారు. అలాగే వరుణ్‌ చక్రవర్తి, వెంకటేశ్‌ అయ్యర్ ఇటీవల మంచి ప్రదర్శన చేశారు. అందుకే వారిని అట్టిపెట్టుకున్నాం. రసెల్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉంటే.. అతడిలో ఒకేసారి ఇద్దరు ప్రపంచశ్రేణి ఆటగాళ్లను చూడొచ్చు. అతడిని రీప్లేస్ చేసే ఆటగాడు దొరకడం కష్టం' అని బ్రెండన్‌ మెక్‌కలమ్‌ పేర్కొన్నారు. 


Also Read: IPL 2022 Auction: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి సురేష్ రైనా.. ధర ఎంతో తెలుసా?


Also Read: Salman -Katrina: కత్రినా కైఫ్‌ వివాహంపై స్పందించిన సల్మాన్‌ ఖాన్‌.. ఇంతకీ ఏమన్నారంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook