IPL 2022 Auction: Here is 10 IPL Teams Current players: ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరిగే వేలంలో ఉన్న క్రికెటర్ల తుది జాబితాను ఐపీఎల్‌ యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. వేలంకు మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేరును నమోదు చేసుకోగా.. ఆ జాబితాను 590కి కుదించారు. ఇందులో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. మరో 7 మంది అసోసియేట్ నేషన్స్‌కు చెందినవారు. మెగా వేలంలో మొత్తం 370 మంది భారత క్రికెటర్లు, 220 మంది విదేశీయులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ టోర్నీలో పాత ఎనిమిది ఫ్రాంచైజీలు వేలానికి ముందు గరిష్టంగా 4 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం బీసీసీఐ ఇచ్చింది. అయితే కొన్ని జట్లు మాత్రం ముగ్గురినే ఎంచుకున్నాయి. ఇక రెండు కొత్త ఫ్రాంచైజీలు లక్నో, అహ్మదాబాద్ ముగ్గురేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. ఇక వేలం నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ పర్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏ ఫ్రాంచైజీకి ఎంత మంది ఆటగాళ్లు కావాలనే విషయాలు ఓసారి చూద్దాం. 


చెన్నై సూపర్ కింగ్స్: 
నాలుగుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీలను అట్టిపెట్టుకుంది. ఇంకా చెన్నైకి 21 మంది ఆటగాళ్లు కావాలి. ఇందులో 7 స్లాట్‌లు విదేశీ ఆటగాళ్లవి. చెన్నైకి రూ. 48 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది. 


ఢిల్లీ క్యాపిటల్స్:
తొలి టైటిల్ కోసం ప్రయత్నిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జ్, పృథ్వీ షాలను రిటైన్ చేసుకుంది. ఇంకా 21 మంది ఆటగాళ్లకు జట్టులో ప్లేస్ ఉంది. 7 విదేశీ ఆటగాళ్లకు స్థానాలు ఉన్నాయి. ఢిల్లీ వాలెట్‌లో రూ. 47.5 కోట్లు మిగిలి ఉన్నాయి.


కోల్‌కతా నైట్ రైడర్స్: 
రెండుసార్లు ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్‌లను అట్టిపెట్టుకుంది. కోల్‌కతాలో మొత్తం 21 స్థానాలు ఖాళీ ఉండగా.. అందులో 6 విదేశీ ఆటగాళ్లవి. కోల్‌కతా వ్యాలెట్‌లో రూ. 48 కోట్లు ఉన్నాయి. 


లక్నో సూపర్ జెయింట్స్:
కొత్త ప్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్, రవి బిష్ణోయ్,మార్కస్ స్టోయినిస్‌లను ఎంచుకుంది. లక్నోలో మొత్తం 22 మంది ఆటగాళ్లకు ఖాళీ ఉండగా.. అందులో ఏడు విదేశీ ప్లేయర్లకు చెందినవి. కొత్త ఫ్రాంచైజీ పర్స్ బ్యాలెన్స్  రూ. 59 కోట్లు. 


ముంబై ఇండియన్స్ :
ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రాలను అట్టిపెట్టుకుంది.  ముంబై పర్స్‌లో రూ. 48 కోట్లు మిగిలాయి. 21 మంది ఆటగాళ్లలో 7గురు విదేశీ ఆటగాళ్లకు స్థానం ఉంది.


పంజాబ్ కింగ్స్:
ఆదినుంచి టైటిల్ కొట్టని పంజాబ్ కింగ్స్ టీమ్ అయాంక్ అగర్వాల్, అర్ష్దీప్ సింగ్‌లను మాత్రమే ఎంచుకుంది. ఫ్రాంచైజీల్లో పంజాబ్ అత్యధికంగా రూ. 72 కోట్ల పర్స్ బ్యాలెన్స్ కలిగి ఉంది. మొత్తం 23 ఆటగాళ్లలో విదేశీ ప్లేయర్లకు 8 స్లాట్లు ఉన్నాయి.


రాజస్థాన్ రాయల్స్ :
ఐపీఎల్ తొలి సీజన్ ఛాంపియన్ అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌ను రిటైన్ చేసుకుంది. రాజస్థాన్ పర్సులో రూ. 62 కోట్లు ఉన్నాయి. మొత్తం 22 స్లాట్స్‌ ఉండగా.. ఇందులో విదేశీ ప్లేయర్లకు 7 స్లాట్లు ఉన్నాయి.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 
తొలి టైటిల్ కోసం వేచిచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను ఎంచుకుంది. బెంగళూరు వాలెట్‌లో రూ. 57 కోట్లు ఉన్నాయి. మొత్తం 22 స్లాట్స్‌ ఉండగా.. ఇందులో విదేశీ ప్లేయర్లకు 7 స్లాట్లు ఉన్నాయి.


సన్‌రైజర్స్ హైదరాబాద్:
రెండుసార్లు ఛాంపియన్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను అట్టిపెట్టుకుంది. తెలుగు జట్టు వాలెట్‌లో రూ. 68 కోట్లు ఉన్నాయి. మొత్తం 22 మంది ఆటగాళ్లలో 7గురు విదేశీ ఆటగాళ్లకు స్థానం ఉంది. 


టీమ్ అహ్మదాబాద్:
కొత్త ప్రాంచైజీ టీమ్ అహ్మదాబాద్.. హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్ లాంటి స్టార్ ఆటగాళ్లను తీసుకుంది. అహ్మదాబాద్ టీమ్ పర్సులో రూ. 52 కోట్లు ఉన్నాయి. 22 మంది ఆటగాళ్లకు స్లాట్ ఖాళీగా ఉండగా.. అందులో విదేశీ ఆటగాళ్లకు 7 స్లాట్లు ఉన్నాయి. 


Also Read: Viral Video: హైవే రోడ్డుపై 4 కిమీ మండుతూ వెళ్లిన ట్రక్కు.. చివరకు ఏమైందంటే? (వీడియో)!!


Also Read: Viral Video: హైవే రోడ్డుపై 4 కిమీ మండుతూ వెళ్లిన ట్రక్కు.. చివరకు ఏమైందంటే? (వీడియో)!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook